Pushpa 2: అల్లు అర్జున్‏తో స్క్రీన్ షేర్ చేసుకోనున్న ఆ బాలీవుడ్ స్టార్.. క్లారిటీ ఇచ్చేసిన పుష్ప 2 ప్రొడ్యూసర్..

|

Oct 09, 2022 | 8:31 AM

ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో మలయాళీ స్టార్ ఫహద్ ఫాజిల్, అనసూయ, సునీల్ కీలకపాత్రలలో నటించారు. ఈ సినిమా సిక్వెల్ పుష్ప 2 ఇటీవలే రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభమైంది.

Pushpa 2: అల్లు అర్జున్‏తో స్క్రీన్ షేర్ చేసుకోనున్న ఆ బాలీవుడ్ స్టార్.. క్లారిటీ ఇచ్చేసిన పుష్ప 2 ప్రొడ్యూసర్..
Arjun Kapoor, Pushpa 2
Follow us on

డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‏గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ మూవీ తర్వాత పుష్ప 2 కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటించిన ఈసినిమా ప్రపంచవ్యాప్తంగా రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో మలయాళీ స్టార్ ఫహద్ ఫాజిల్, అనసూయ, సునీల్ కీలకపాత్రలలో నటించారు. ఈ సినిమా సిక్వెల్ పుష్ప 2 ఇటీవలే రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభమైంది. అయితే సినిమా గురించి ఎప్పటికప్పుడు నెట్టింట రూమర్స్ హల్చల్ చేస్తున్నాయి. గతంలో ఈ మూవీలో విజయ్ సేతుపతి, సాయి పల్లవి అతిధి పాత్రలలో కనిపించనున్నారని టాక్ నడిచింది. అయితే ఆ వార్తలలో నిజం లేదని.. కేవలం రూమర్స్ అంటూ క్లారిటీ ఇచ్చారు ప్రొడ్యూసర్ రవి శంకర్. ఇక కొద్దిరోజులుగా ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ అర్జున్ కపూర్ సైతం నటిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ అప్డేట్స్ పై స్పందించారు నిర్మాత నవీన్ యెర్నేని.

ఇటీవల పింక్ విల్లాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిర్మాత నవీన్ యెర్నేని మాట్లాడుతూ.. పుష్ప 2 చిత్రం గురించి వస్తున్న వార్తలలో ఎలాంటి నిజం లేదన్నారు. కేవలం అవి అవాస్తవాలు అని తేల్చీ చెప్పారు. నవీన్ మాట్లాడుతూ.. ““ఫహద్ ఫాసిల్ తన పాత్రను చేస్తున్నాడు. కాబట్టి ఇది వంద శాతం తప్పుడు వార్త. ఏ బాలీవుడ్ హీరో నటించడం లేదు. ఈ నెలాఖరు నుంచి పుష్ప 2 షూటింగ్‌ ప్రారంభిస్తాం. 20 నుంచి 30వ తేదీలోపు షూటింగ్‌ ప్రారంభిస్తాం. మొదట్లో హైదరాబాద్‌లో షూటింగ్ చేసి, అడవికి, ఇతర లొకేషన్లకు వెళతాం” అన్నారు. ఇక శనివారం హైదరాబాద్‌లో అల్లు అర్జున్‌తో లుక్ టెస్ట్ ప్రక్రియను పూర్తి చేసినట్లు సమాచారం . త్వరలోనే నేషనల్ క్రష్ రష్మిక సైతం పుష్ప 2 చిత్రీకరణలో పాల్గోననుంది.