Natti Kumar: సీఎం జగన్‌ చిరంజీవినే ఎందుకు పిలుస్తున్నారు.? సంచలన వ్యాఖ్యలు చేసిన నిర్మాత నట్టికుమార్‌.

|

Aug 17, 2021 | 7:41 PM

Natti Kumar Comments: ఇటీవల టాలీవుడ్‌ ఇండస్ట్రీ సంచలనాలకు కేరాఫ్‌గా మారుతోంది. 'మా' అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన వేడీ ఇంకా చల్లారకముందే మరో వివాదం తెరపైకి వచ్చింది. కరోనా..

Natti Kumar: సీఎం జగన్‌ చిరంజీవినే ఎందుకు పిలుస్తున్నారు.? సంచలన వ్యాఖ్యలు చేసిన నిర్మాత నట్టికుమార్‌.
Natti Kumar Comments On Chi
Follow us on

Natti Kumar Comments: ఇటీవల టాలీవుడ్‌ ఇండస్ట్రీ సంచలనాలకు కేరాఫ్‌గా మారుతోంది. ‘మా’ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన వేడీ ఇంకా చల్లారకముందే మరో వివాదం తెరపైకి వచ్చింది. కరోనా తదనంతరం పరిణామాల నేపథ్యంలో సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న స‌మ‌స్యల‌పైనా చ‌ర్చించేందుకు ఇటీవ‌లే ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌ మోహన్‌ రెడ్డి నుంచి చిరంజీవికి ఆహ్వానం అందిన విషయం తెలిసిందే. అయితే ఈ భేటీలో సీఎంకి విన్నవించాల్సిన అన్ని విష‌యాల‌పైనా కూలంకుశంగా చ‌ర్చించి వెళ్లాల‌న్న ఉద్దేశంతో హైదరాబాద్‌లోని చిరంజీవి నివాసంలో పలువురు సినీ ప్రముఖులు సమావేశమయ్యారు. ఇప్పుడు ఈ మీటింగ్‌ రచ్చకు కారణంగా మారింది. చిరు ఇంట్లో జరిగిన ఈ సమావేశంపై నిర్మాత నట్టికుమార్ సంచలన కామెంట్స్‌ చేశారు. ప్రస్తుతం నట్టి చేసిన ఈ వ్యాఖ్యలు టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారాయి.

ఇంతకీ నట్టి కుమార్‌ ఏమన్నారంటే.. మెగాస్టార్ చిరంజీవి అంటే నమ్మకం, గౌరవం ఉందన్న నట్టి.. దాసరి తర్వాత చిరంజీవి ఇండస్ట్రీ పెద్దగా ఉండాలని మొదట అన్నది తానేనని చెప్పారు. కానీ విభజించి పాలించడం మానుకోవాలని నట్టి ఘాటుగానే మాటల దాడి చేశారు. చివరి సారి కూడా చిరంజీవి ఇంట్లోనే సమావేశం పెట్టారన్న నట్టి కుమార్‌.. ఆ మీటింగ్ సారాంశం ఏంటని ప్రశ్నించారు. చిన్న సినిమా నిర్మాతలు మీకు గుర్తున్నారా.. లేరా? అంటూ గరం అయ్యారు. అంతటితో ఆగకుండా.. ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ‘మా’ అసోసియేషన్ ఒక్కటే కాదు, 24 శాఖలు ఉంటాయని గ్రహించాలన్నారు. ఇక సీఎం జగన్‌ ప్రొడ్యూసర్ కౌన్సిల్‌ను, ఫిల్మ్ ఛాంబర్‌ను ఆహ్వానించకుండా.. చిరంజీవినే ఏపీ సీఎం జగన్‌గారు పర్సనల్‌గా ఎందుకు పిలుస్తున్నారు? అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అంతేకాకుండా.. ఇండస్ట్రీలోని పెద్ద హీరోలను, నిర్మాతల మండలి వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీని సమావేశానికి ఎందుకు పిలవలేదని ప్రశ్నించిన నట్టి.. చిరంజీవి మీటింగ్‌లో నాగార్జున, పెద్ద నిర్మాతలు తప్ప.. ఇతర పెద్ద హీరోలు, చిన్న నిర్మాతలు ఒక్కరూ లేరన్నారు. చిరంజీవి చిన్న,పెద్ద వాళ్ళను కలుపుకొనిపోవాలని, ఇకనైనా ఈ విషయాలన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఆయన అందరివాడిగా ముందుకెళ్లాలని కామెంట్‌ చేశారు. అంతటితో ఆగని నట్టి కుమార్‌ ఓటీటీపై కూడా తనదైన శైలిలో స్పందించారు. ఓటీటీ‌లో పెద్ద సినిమాలు విడుదల చేస్తూ థియేటర్లకు అన్యాయం చేస్తున్నారని దుయ్యబట్టారు.

సురేష్ బాబు ‘నారప్ప’ సినిమాను ఓటీటీలో విడుదల చేశారని.. థియేటర్ల వల్లే తాము పెద్ద వాళ్లం అయ్యామని, మాకు ఇంతమంది అభిమానులు ఏర్పడ్డారని, ఇంత ఇమేజ్ వచ్చిందని సినీ పెద్దలు మరచిపోకూడదని తెలిపారు. కాబట్టి ఇండస్ట్రీ సమస్యలు తెలుసుకోవడానికి చిన్న, పెద్ద అందరితో చర్చలు జరిపి, ఆ తర్వాత ప్రభుత్వం దృష్టికి వాటిని తీసుకువెళ్లాలని చిరంజీవిని కోరుతున్నట్లు తెలిపారు. మరి నట్టి కుమార్‌ చేసిన ఈ సంచలన ఆరోపణలపై ఇటు చిరు కానీ, అటు సమావేశానికి హాజరైన వారు కానీ ఎలా స్పందిస్తారో చూడాలి.

Also Read: OLA e-Scooter: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్..ఇది చాలా ఖరీదు..ధర కారణంగా బుకింగ్ రద్దు చేసుకోవాలంటే ఇలా చేయండి!

AHA: ఈ అమ్మాయిలకు ఏది సూటిగా చెప్పడం రాదా.? ఆకట్టుకుంటోన్న తరగతి గది దాటి ట్రైలర్‌.. ఆహాలో ఎప్పటి నుంచి రానుందంటే.

Neeraj Chopra: ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత నీరజ్‌ చోప్రాకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు..