
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. ఈ సినిమా కోసం అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా జూన్ 4న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలకానుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా జాన్వీ కపూర్ నటిస్తుంది. అలాగే ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ విషయంలో చాలా గందరగోళం నెలకొన్న విషయం తెలిసిందే. దాంతో విడుదల ఆలస్యం అవుతూ వచ్చింది. ఆతర్వాత మొత్తంగా జూన్ 4న సినిమా విడుదలకు సిద్ధం అయ్యింది. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టింది పెద్ది సినిమా టీమ్. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ ట్రైలర్ సినిమా పై అంచనాలను భారీగా పెంచేసింది. దాంతో ఈ సినిమా కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.
కాగా ఇప్పుడు పెద్ది సినిమా రిలీజ్ పై మరో గందరగోళం నెలకొంది. ఆంధ్రలో సినిమాకు ఎలాంటి ఇబ్బంది లేకపోయినప్పటికీ తెలంగాణలో సినిమాలో విడుదలవుతుందా.? లేదా.? అన్న సందేహం నెలకొంది. తాజాగా తెలంగాణ ఎగ్జిబిటర్లు శనివారం తెలుగు ఫిలిం ఛాంబర్‌లో మాట్లాడుతూ.. ‘పెద్ది’కి పర్సంటేజీ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. దాంతో పెద్ది రిలీజ్ పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దాంతో నిర్మాత నట్టికుమార్ షాకింగ్ కామెంట్స్ చేశారు. పెద్ది సినిమా విడుదల అవ్వకపోతే నిరాహార దీక్ష చేస్తా అని చెప్పుకొచ్చారు.
‘మీకు మంగళవారం నైట్ వరకు ఎదురుచూస్తాం.. ఎదో ఒకటి డిసైడ్ అవ్వండి.. మీరు పెద్ది సినిమాని ఆపాలని చూస్తే.. బుధవారం(మే 27) ఉదయం 10 గంటల నుంచి తెలుగు ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో ఆమరణ నిరహార దీక్షకు కూర్చుంటా.. చిరంజీవిగారి దగ్గరకు వెళ్దాం.. చిరంజీవి గారితో మాట్లాడదాం.. పెద్దలందరూ కలిసి పర్సంటేజీ విషయంలో ఓ నిర్ణయం తీసుకున్నారు. దాన్ని ఇప్పుడు మళ్లీ మీరు వెతిరేకించడం ఎంతవరకూ కరెక్ట్.?మీ వెనకాల కొంతమంది ఆడిస్తున్నారు. ఆ ఆటకు బలికావద్దు అంటూ నట్టికుమార్ చెప్పుకొచ్చారు. ఈ కామెంట్గ్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
Producer #NattiKumar :
“మీరు #PEDDI సినిమా ఇదే ప్రకారంగా ఆపాలని నిర్ణయం ఏమైనా తీసుకుంటే బుధవారం నాడు 10 గంటలకి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్షకు నేను కూర్చుంటాను.” pic.twitter.com/NaeuuHtT7Q
— Whynot Cinemas (@whynotcinemass_) May 23, 2026