AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Peddi: పెద్ది రిలీజ్ ఆపాలని చూస్తున్నారు.. ఆమరణ నిరహార దీక్ష చేస్తా..

మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా పెద్ది. తొలి చిత్రం ఉప్పెనతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా ఇది. దీంతో ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Peddi: పెద్ది రిలీజ్ ఆపాలని చూస్తున్నారు.. ఆమరణ నిరహార దీక్ష చేస్తా..
Peddi Movie
Rajeev Rayala
|

Updated on: May 24, 2026 | 6:51 AM

Share

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. ఈ సినిమా కోసం అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా జూన్ 4న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలకానుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా జాన్వీ కపూర్ నటిస్తుంది. అలాగే ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ విషయంలో చాలా గందరగోళం నెలకొన్న విషయం తెలిసిందే. దాంతో విడుదల ఆలస్యం అవుతూ వచ్చింది. ఆతర్వాత మొత్తంగా జూన్ 4న సినిమా విడుదలకు సిద్ధం అయ్యింది. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టింది పెద్ది సినిమా టీమ్. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ ట్రైలర్ సినిమా పై అంచనాలను భారీగా పెంచేసింది. దాంతో ఈ సినిమా కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.

కాగా ఇప్పుడు పెద్ది సినిమా రిలీజ్ పై మరో గందరగోళం నెలకొంది. ఆంధ్రలో సినిమాకు ఎలాంటి ఇబ్బంది లేకపోయినప్పటికీ తెలంగాణలో సినిమాలో విడుదలవుతుందా.? లేదా.? అన్న సందేహం నెలకొంది. తాజాగా తెలంగాణ ఎగ్జిబిటర్లు శనివారం తెలుగు ఫిలిం ఛాంబర్‌లో మాట్లాడుతూ.. ‘పెద్ది’కి పర్సంటేజీ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. దాంతో పెద్ది రిలీజ్ పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దాంతో నిర్మాత నట్టికుమార్ షాకింగ్ కామెంట్స్ చేశారు. పెద్ది సినిమా విడుదల అవ్వకపోతే నిరాహార దీక్ష చేస్తా అని చెప్పుకొచ్చారు.

‘మీకు మంగళవారం నైట్ వరకు ఎదురుచూస్తాం.. ఎదో ఒకటి డిసైడ్ అవ్వండి.. మీరు పెద్ది సినిమాని ఆపాలని చూస్తే.. బుధవారం(మే 27) ఉదయం 10 గంటల నుంచి తెలుగు ఫిలిం ఛాంబర్‌ ఆధ్వర్యంలో ఆమరణ నిరహార దీక్షకు కూర్చుంటా.. చిరంజీవిగారి దగ్గరకు వెళ్దాం.. చిరంజీవి గారితో మాట్లాడదాం.. పెద్దలందరూ కలిసి పర్సంటేజీ విషయంలో ఓ నిర్ణయం తీసుకున్నారు. దాన్ని ఇప్పుడు మళ్లీ మీరు వెతిరేకించడం ఎంతవరకూ కరెక్ట్.?మీ వెనకాల కొంతమంది ఆడిస్తున్నారు. ఆ ఆటకు బలికావద్దు అంటూ నట్టికుమార్ చెప్పుకొచ్చారు. ఈ కామెంట్గ్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
పాముల పండగ.. ఆ ప్రాంతానికి లక్షల పాములు.. ఈ వీడియో చూస్తే వణుకే
పాముల పండగ.. ఆ ప్రాంతానికి లక్షల పాములు.. ఈ వీడియో చూస్తే వణుకే
యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న కనకవ్య ఫోక్ సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న కనకవ్య ఫోక్ సాంగ్..
‘వందేభారత్‌’ను ప్యాసింజర్‌ చేశారా? ప్రయాణికుల గగ్గోలు!
‘వందేభారత్‌’ను ప్యాసింజర్‌ చేశారా? ప్రయాణికుల గగ్గోలు!
50 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు! మిస్టర్‌ బీస్ట్‌ సరికొత్త రికార్డ్
50 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు! మిస్టర్‌ బీస్ట్‌ సరికొత్త రికార్డ్
ఆస్తులు పంచి అంత్యక్రియల ఖర్చులు అకౌంట్‌లో వేసి. కుటుంబం ఆత్మహత్య
ఆస్తులు పంచి అంత్యక్రియల ఖర్చులు అకౌంట్‌లో వేసి. కుటుంబం ఆత్మహత్య
"ఇరాన్ మాట తప్పితే.. మళ్లీ బాంబులే!" - ట్రంప్ వార్నింగ్
ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకుండా ఇలా చేస్తే పచ్చడి మళ్లీ కొత్తగా
ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకుండా ఇలా చేస్తే పచ్చడి మళ్లీ కొత్తగా
కళ్లు చెదిరే క్యాచ్‌తో విమర్శకుల నోళ్లు మూయించిన వైభవ్..
కళ్లు చెదిరే క్యాచ్‌తో విమర్శకుల నోళ్లు మూయించిన వైభవ్..
స్కూలుకి వేళాయె.. నోరూరించే బ్రేక్‌ ఫాస్ట్‌ స్కీం నేటి నుంచే!
స్కూలుకి వేళాయె.. నోరూరించే బ్రేక్‌ ఫాస్ట్‌ స్కీం నేటి నుంచే!
డాక్టర్ల ప్రిస్క్రిప్షన్‌పై Rx అని ఎందుకు ఉంటుంది..?
డాక్టర్ల ప్రిస్క్రిప్షన్‌పై Rx అని ఎందుకు ఉంటుంది..?