సర్కారు వారి పాట సినిమాతో మరోసారి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu). డైరెక్టర్ పరశురామ్ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది. ఇందులో మహేష్.. కీర్తి సురేష్ లుక్స్ ప్రేక్షకులను ఆకట్టుకోగా.. తమన్ అందించిన సంగీతం మరో లెవల్‌కు తీసుకెళ్లింది. ఈ సినిమా తర్వాత మహేష్ తన తదుపరి ప్రాజెక్ట్స్ పై ఫోకస్ పెట్టాడు. డైరెక్టర్ త్రివిక్రమ్, రాజమౌళి దర్శకత్వంలో సినిమాలు చేయనున్నాడు మహేష్.. ముందుగా డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో తన తదుపరి ప్రాజెక్ట్ షురు చేయనున్నాడు సూపర్ స్టార్. ఇప్పటికే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ జూన్ నెలలో ప్రారంభం కానున్నట్లు గతంలోనే మహేష్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అతడు, ఖలేజా వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన మహేష్, త్రివిక్రమ్ కాంబో మరోసారి రిపీట్ అవుతుండడంతో ఈ సినిమా పై అంచనాలు భారీగానే నెలకొన్నాయి. #SSMB 28 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా అప్డేట్స్ కోసం మహేష్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ మూవీ అప్డేట్స్ ఇవ్వండయ్యా అంటూ ఓ నెటిజన్ సోషల్ మీడియాలో మొర పెట్టుకున్నాడు. దీంతో సదరు నెటిజన్ ట్వీట్‌కు ప్రొడ్యూసర్ నాగవంశీ స్పందిస్తూ మహేష్, త్రివిక్రమ్ సినిమా పై క్లారిటీ ఇచ్చేశాడు..
” మీ ఆత్రుత నాకు అర్థమైంది అబ్బాయిలు.. మీకు అప్డేట్ ఇవ్వకూడదని కాదు.. దయచేసి మాకు కాస్త సమయం ఇవ్వండి.. దాదాపు 12 సంవత్సరాల తర్వాత మళ్లీ వస్తున్న కాంబినేషన్ ఇది.. ప్రతి చిన్న విషయం చాలా ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటున్నాం.. దయచేసి వెయిట్ చేయండి.. #SSMB28 మనందరికీ గుర్తుండిపోతుంది” అంటూ ట్వీట్ చేశారు. దీంతో మహేష్, త్రివిక్రమ్ సినిమా అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు క్లారిటీ ఇచ్చారు ప్రొడ్యూసర్ నాగవంశీ. ఈ సినిమాలో హీరోయిన్ గా పూజాహెగ్డే నటిస్తుంది. అలాగే తమన్ ఈ సినిమాకు సంగీతం అందించనున్నాడు.
i understand ur anxiety boys kani please give us sometime its not that we dont want to give an update kada the combination is coming back after 12years every small thing will be very special plss wait….#SSMB28 will be memorable for all of us
— Naga Vamsi (@vamsi84) June 10, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.