
టాలీవుడ్ యంగ్ హీరో ఆశిష్ బ్యాచిలర్ లైఫ్‌కు ఫుల్ స్టాప్ పెట్టనున్నారు. త్వరలోనే అద్విత రెడ్డితో ఏడడుగులు వేయబోతున్నారు. ఇటీవలే వీరిద్దరి నిశ్చితార్థం సింపుల్ గా జరిగింది. కానీ పెళ్లి మాత్రం గ్రాండ్‌గా జరుపుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలోని స్టార్స్ అందరికీ శుభలేఖలు ఇస్తూ.. పెళ్లికి రావాలంటూ ఆహ్వానాలు పంపిస్తున్నారు. ఆశిష్.. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సోదరుడు శిరీష్ కుమారుడు. రౌడీ బాయ్స్ సినిమాతో సినీ పరిశ్రమలోకి హీరోగా అరంగేట్రం చేశాడు ఆశిష్. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించింది. 2022లో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఆశిష్ తన రెండో సినిమాతో మరోసారి థియేటర్లలో సందడి చేయబోతున్నాడు. అలాగే తన మూడో సినిమాను కూడా పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు.
ఓవైపు వరసుగా సినిమాలు చేస్తున్న ఆశిష్.. ఇప్పుడు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఏపీకి చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తె అద్విత రెడ్డిని ఆశిష్ వివాహం చేసుకోబోతున్నారు. వీరిద్దరి నిశ్చితార్థం వీడియోస్, ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఇక త్వరలోనే ఆశిష్ పెళ్లి వేడుకలు ప్రారంభం కానున్నాయి. వివాహ బాధ్యతలను దగ్గరుండి చూసుకుంటున్నారు నిర్మాత దిల్ రాజు. ఈ క్రమంలోనే పెళ్లి పిలుపులు మొదలుపెట్టారు. ఈరోజు దిల్ రాజు.. ఆయన కుమార్తె హన్షితా రెడ్డి, శిరీష్, ఆశిష్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నివాసంలో కలుసుకున్నారు. తారక్ కు పెళ్లి కార్డు ఇచ్చి ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఆశిష్ కు శుభాకాంక్షలు తెలిపారు తారక్. ఇందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ వైరలవుతున్నాయి.
ఇదిలా ఉంటే..ప్రస్తుతం తారక్ దేవర సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తోన్న ఈ మాస్ యాక్షన్ డ్రామా పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా.. సైఫ్ అలీ ఖాన్ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ మూవీపై మరింత హైప్ పెంచాయి. ఇందులో తారక్ ఊర మాస్ అవతారంలో కనిపించనున్నారు. ఈ ఏడాది వేసవిలో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
Dil Raju and Shirish personally invited Man of Masses NTR @Tarak9999 for the joyous occasion of Shirish’s son, @AshishVoffl ‘s wedding. pic.twitter.com/ytd7FzpQjS
— BA Raju’s Team (@baraju_SuperHit) January 31, 2024
Here’s the #DevaraGlimpse… https://t.co/Ag4OQS122F
— Jr NTR (@tarak9999) January 8, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.