Allu Aravind: దర్శకుడు పరుశురామ్‌పై అల్లు అరవింద్ ఇన్‌డైరెక్ట్‌ పంచ్‌లు…

ఈమధ్య కొందరు సినిమా కమిట్మెంట్ ఇచ్చి గీత దాటి వెళ్లారు అని పరోక్షంగా దర్శకుడు పరశురామ్‌ను ఉద్దేశించి కామెంట్ చేశారు అల్లు అరవింద్. పరశురామ్ గీత ఆర్ట్స్ కి సినిమా చేయాల్సి ఉండగా, ఇంకో నిర్మాత దిల్ రాజుకి సినిమా చేస్తాను అని ఒప్పుకొని అధికారికంగా ప్రకటించాడు. అప్పుడు అల్లు అరవింద్ చాలా సీరియస్ అయి, ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతా అని చెప్పి.. మళ్లీ వెనక్కి తగ్గారు.

Allu Aravind: దర్శకుడు పరుశురామ్‌పై అల్లు అరవింద్ ఇన్‌డైరెక్ట్‌ పంచ్‌లు...
Allu Aravind - Parasuram

Updated on: Jun 01, 2023 | 4:13 PM

మెగా ప్రొడ్యూసర్‌ అల్లు అరవింద్‌ సంచలన కామెంట్లు చేశారు. సూటిగా సుతిమెత్తగా ఎవరిని టచ్‌ చేయాలో వారిపైనే పంచ్‌లేశారు. మనిషన్నాక మాట మీదుండాలి.. మాట తప్పితే మనిషి ఎలా అవుతాడని పరోక్షంగా ఓ డైరెక్టర్‌ను ఉద్దేశించి కామెంట్లు చేశారు. 2018 సినిమా థ్యాంక్స్‌ మీట్‌లో చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. షార్ట్ పిరియడ్‌లో పేరు, డబ్బు వచ్చేయాలనుకోవడం మంచికాదన్నారు అరవింద్‌. కొత్త వాళ్లను తొక్కేయకూడదంటూనే.. వాళ్ల కోసం స్పేస్ క్రియేట్ చేయాలన్నారు.  కాగా అల్లు అరవింద్ ఈ కామెంట్స్ దర్శకుడు పరుశురామ్ గురించే చేసినట్లు చాలామంది అనుకుంటున్నారు. గతంలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో వరుస సినిమాలు చేశాడు పరుశురామ్. కానీ ఆ తర్వాత ఎందుకో ఆ బ్యానర్‌తో సన్నిహితంగా మెలగడం లేదు. ఇక ఇదే పంక్షన్‌లో దర్శకుడు చందూ మొండేటిని ప్రశంసించారు అల్లు అరవింద్. ఎన్ని పెద్ద ఆఫర్లు వచ్చినప్పటికీ.. తనకు ఇచ్చిన సినిమా కమిట్‌మెంట్‌ను అతను నిలపుకున్నట్లు వెల్లడించారు.

ఇక ఇటీవల  ‘కస్టడీ’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా పరశురాం గురించి హీరో నాగచైతన్య ఊహించని కామెంట్స్ చేశాడు. ‘ఆయన గురించి మాట్లాడటం టైమ్ వేస్ట్. ఆయన నా టైమ్ వేస్ట్ చేశారు. ఆయన గురించి ఇప్పుడు మాట్లాడటం నా టైమ్ వేస్ట్.. మీ టైమ్ వేస్ట్. వేరే రీజన్ ఏమీ లేదండి.. టైమ్ వేస్ట్ అంతే’ అని నవ్వుతూనే తన కోపాన్ని వ్యక్తపరిచారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.