కమెడియన్‌గా ఇండస్ట్రీకి వచ్చినా తర్వాత హీరోగానూ సత్తా చూపించారు సునీల్. కామెడీ హీరోగా ఈయన తనకంటూ మార్కెట్ సంపాదించుకున్నారు. సునీల్ కామెడీ హీరోగా ఆపేసిన తర్వాత.. ఆ రోల్ అలాగే ఉండిపోయింది. ఆ లోటును భర్తీ చేయడానికి చాలా మంది కమెడియన్లు ప్రయత్నించినా వర్కవుట్ అవ్వలేదు. కానీ ప్రియదర్శి మాత్రం సునీల్ ప్లేస్‌పై కన్నేసారు. ఈ మధ్య కమెడియన్‌గానే కాకుండా.. హీరోగానూ మంచి గుర్తింపు సంపాదించుకుంటున్నారు దర్శి. ముఖ్యంగా నాలుగేళ్ల కింద మల్లేశం సినిమాతో నటుడిగా తనదైన ముద్ర వేసారు ఈ నటుడు. ఆ తర్వాత జాతి రత్నాలులో నవీన్ పొలిశెట్టితో కలిసి కడుపులు చెక్కలు చేసారు.
ఈ మధ్యే బలగంతో ప్రియదర్శి రేంజ్ మరింత పెరిగిపోయింది. వేణు తెరకెక్కించిన ఈ చిత్రంలో కేవలం కామెడీతోనే కాదు.. ఎమోషనల్‌గానూ ఆకట్టుకున్నారు దర్శి. ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే సన్నివేశంలో తన నటనతో కన్నీరు పెట్టించారు ప్రియదర్శి. బలగం తర్వాత ఈ నటుడికి హీరోగానూ చాలా ఆఫర్స్ వస్తున్నాయి. అలాగే రెమ్యునరేషన్ రేంజ్ కూడా పెరిగిందని తెలుస్తుంది.
సునీల్ ప్లేస్‌లోకి రావడం అంటే అంత ఈజీ కాదు. హీరోగా తన మార్కెట్ పడిపోయిందని తెలిసాక.. మళ్లీ రూట్ మార్చేసి కమెడియన్‌గానే కాకుండా.. విలన్‌గానూ రప్ఫాడిస్తున్నారు సునీల్. కానీ ప్రియదర్శి మాత్రం కేవలం కమెడియన్‌గానే కాకుండా హీరోగానూ సత్తా చూపించాలని చూస్తున్నారు. మరి ఈ ప్రయత్నం ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.