Mamitha Baiju: క్రేజీ ఆఫర్ అందుకున్న ప్రేమలు బ్యూటీ.. ఆ స్టార్ హీరోకి చెల్లిగా మమిత బైజు

|

Aug 07, 2024 | 8:48 AM

మమిత బైజు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఎక్కడ చూసిన ఈ అమ్మడి ఫొటోలే కనిపిస్తున్నాయి. ప్రేక్షకులు ఈ అమ్మడి అందానికి ఫిదా అయ్యారు. ఇక ఈ అమ్మడు ఇప్పుడు క్రేజీ ఆఫర్స్ అందుకుంటుంది. తాజాగా ఈ బ్యూటీకి ఓ క్రేజీ ఆఫర్ అందుకుందని తెలుస్తోంది. దళపతి విజయ్ తదుపరి చిత్రంలో మలయాళ నటి మమితా బైజు కూడా నటిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.

Mamitha Baiju: క్రేజీ ఆఫర్ అందుకున్న ప్రేమలు బ్యూటీ.. ఆ స్టార్ హీరోకి చెల్లిగా మమిత బైజు
Mamitha Baiju
Follow us on

మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన సినిమాలు ఈమధ్యకాలంలో మంచి విజయాలను అందుకుంటున్నాయి. అలాగే ఇప్పుడు ప్రేమమ్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ సినిమా తెలుగులో డబ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన మమిత బైజు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఎక్కడ చూసిన ఈ అమ్మడి ఫొటోలే కనిపిస్తున్నాయి. ప్రేక్షకులు ఈ అమ్మడి అందానికి ఫిదా అయ్యారు. ఇక ఈ అమ్మడు ఇప్పుడు క్రేజీ ఆఫర్స్ అందుకుంటుంది. తాజాగా ఈ బ్యూటీకి ఓ క్రేజీ ఆఫర్ అందుకుందని తెలుస్తోంది. దళపతి విజయ్ తదుపరి చిత్రంలో మలయాళ నటి మమితా బైజు కూడా నటిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి ‘దళపతి 69’ అనే టైటిల్‌ను తాత్కాలికంగా ఖరారు చేశారు. ఈ సినిమాలో మమిత కూడా ఓ పాత్రలో నటిస్తుందని తమిళ మీడియా వార్తలు వినిపిస్తున్నాయి. ‘ప్రేమలు’ తర్వాత మమిత క్రేజ్ మరింత పెరిగింది.

దళపతి విజయ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీ కావడానికి సిద్ధమవుతున్నారు. సొంత పార్టీని కూడా ప్రకటించారు. ప్రస్తుతం ‘గోట్’ అనే చిత్రంలో నటిస్తున్నాడు, ఆ తర్వాత తన కెరీర్‌లో చివరి సినిమా చేయనున్నాడని టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాలో మమిత కూడా కనిపించనుందని సమాచారం. ‘దళపతి 69’ చిత్రానికి హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తారని సమాచారం. ఈ సినిమాలో మమిత ప్రధాన పాత్రలో నటించనుందని తెలుస్తోంది. ఈ సినిమాలో దళపతి విజయ్ సోదరిగా మామిత నటిస్తుందని తెలుస్తోంది. ఇది విని ఆమె అభిమానులు థ్రిల్ అవుతున్నారు. దీనిపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.

మమిత 2017లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ‘సర్వోపరి పాలక్కారన్’ ఆమె మొదటి సినిమా.. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించింది ఈ చిన్నది. ఈ ఏడాది విడుదలైన ‘ప్రేమలు’ సినిమా ఈ బ్యూటీ కెరీర్‌కు మైలేజీనిచ్చింది. దీని తర్వాత ఆమెకి చాలా ఆఫర్లు వస్తున్నాయి. జి.వి.ప్రకాష్ కుమార్ నటించిన ‘రెబల్’ చిత్రంతో మమిత తమిళ సినీ రంగ ప్రవేశం చేసింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అయితే ఈ అమ్మడికి తమిళ సినిమాల నుంచి ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. అలాగే తెలుగులోనూ అవకాశాలు అందుకుంటుంది ఈ అమ్మడు. ఇక విజయ్ సినిమాల విషయానికొస్తే.. ‘గోట్’లో నటిస్తున్నాడు. మీనాక్షి చౌదరి, మాళవిక శర్మ ఈ చిత్రంలో నటిస్తున్నారు. సెప్టెంబర్ 5న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రానికి వెంకట ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.