Actor Darshan: దర్శన్ ఆరడుగుల రాక్షసుడు.. సెట్‏లో నటితో అలాంటి ప్రవర్తన..

ఈ కేసులో షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. దీంతో అతడిని కఠినంగా శిక్షించాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ కేసుపై కన్నడ బిగ్ బాస్ 9వ సీజన్ కంటెస్టెంట్ ప్రశాంత్ సంబర్గి సైతం రియాక్ట్ అయ్యారు. హీరో దర్శన్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదని కోరుతూ పోస్ట్ చేశాడు. దర్శన్ మనిషి కాదు.. మృగమని.. అతడు ఆరడుగుల రాక్షసుడు అంటూ రాసుకొచ్చాడు.

Actor Darshan: దర్శన్ ఆరడుగుల రాక్షసుడు.. సెట్‏లో నటితో అలాంటి ప్రవర్తన..
Darshan

Updated on: Jun 19, 2024 | 4:26 PM

ప్రియురాలి కోసం వీరాభిమానినే దారుణంగా హత్య చేసిన కేసులో కన్నడ స్టార్ దర్శన్ కటకటాలపాలైన సంగతి తెలిసిందే. చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామిని దర్శన్ మరికొందరితో కలిసి కిడ్నాప్ చేసి హింసించి చంపి మురికి కాలువలో పడేశాడు. ఈ కేసులో షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. దీంతో అతడిని కఠినంగా శిక్షించాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ కేసుపై కన్నడ బిగ్ బాస్ 9వ సీజన్ కంటెస్టెంట్ ప్రశాంత్ సంబర్గి సైతం రియాక్ట్ అయ్యారు. హీరో దర్శన్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదని కోరుతూ పోస్ట్ చేశాడు. దర్శన్ మనిషి కాదు.. మృగమని.. అతడు ఆరడుగుల రాక్షసుడు అంటూ రాసుకొచ్చాడు.

దర్శన్ తన గ్యాంగ్ తో కలిసి శాఖాహారి అయిన రేణుకాస్వామి నోట్లో బలవంతంగా మాంసం ముక్కలు కుక్కి, విచక్షణారహితంగా దాడి చేసి చంపేసిన సంగతి తెలిసిందే. అయితే గతంలోనూ శాఖాహారి అయిన నటితో ఆమెకు తెలియకుండా మాంసం తినిపించి చూసి దర్శన్ సంతోషించాడని ప్రశాంత్ ఆరోపించాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ దర్శన్ గురించి షాకింగ్ విషయాలు తెలిపాడు.

“దర్శన్ ఆరడుగుల రాక్షసుడు. రేణుకాస్వామి తాను శాఖాహారినని, లింగాయత్ అని వేడుకున్నా వినకుండా హింసించి హత్య చేసిన ఈ రౌడీ బాస్.. మూడేళ్ల క్రితం ఒక ప్రముఖ కన్నడ నటి.. సినిమా షూటింగ్ సెట్ లో ఆమె శాఖాహారినని చెప్పి సాత్విక ఆహారం అడిగింది. కానీ ఆమె మాటలను పట్టించుకోకుండా దర్శన్ రాక్షసుడిలా ప్రవర్తించాడు. ఆమె భోజనంలో ఆమెకు తెలియకుండా నాన్ వెజ్ మాంసాన్ని వడ్డించాడు. అది ఆమె తింటే చూస్తూ దుర్యోధనుడిలా నవ్వాడు. అతడు ఒక శాడిస్ట్. మనిషి కాదు మృగం. అతడి మనస్తత్వం రాక్షసుడి వంటిది. అలాంటి వారికే ఇలాంటి ఆలోచనలు వస్తాయి” అంటూ ఫేస్ బుక్ లో రాసుకొచ్చాడు. కొన్ని రోజుల క్రితం దర్శన్ గురించి మరో పోస్ట్ చేశాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.