
ప్రసాద్ బెహరా.. ఈ పేరు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే చాలా మందికి తెలిసే ఉంటుంది. యూట్యూబ్ లో పలు షార్ట్ ఫిలిమ్స్ తో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు ప్రసాద్. తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను మెప్పించాడు ప్రసాద్ బెహరా. ఇప్పటికే చాలా షార్ట్ ఫిలిమ్స్ లో నటించాడు. ముఖ్యంగా కామెడీ ప్రధాన పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించాడు ప్రసాద్. ఇప్పటికే చాలా షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన ప్రసాద్ బెహరా ఇప్పుడు సినిమాల్లోకి వస్తున్నాడు. మెగా డాటర్ నిహారిక నిర్మిస్తున్న కమిటీ కుర్రాళ్ళు అనే సినిమాలో నటిస్తున్నాడు ప్రసాద్ బెహరా. ఇదిలా ఉంటే తనకు ఓ బడా సినిమాలో ఛాన్స్ వచ్చినా కూడా తనను సినిమాలో నుంచి తీసేశారని చెప్పి ఎమోషనల్ అయ్యాడు ప్రసాద్ బెహరా.
ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో ప్రసాద్ బెహరా మాట్లాడుతూ తనకు ఇండస్ట్రీలో ఓ చేదు అనుభవం ఎదురైందని తెలిపాడు. ఓ పెద్ద ప్రొడక్షన్ హౌస్ లో తనకు డైరెక్టర్ గా సినిమా ఛాన్స్ వచ్చిందని తెలిపాడు. అయితే ఒకసారి ప్రొడక్షన్ ఆఫీస్ కు వెళ్తే.. నన్ను ఓకే చేసి అడ్వాన్స్ తీసుకోవడానికి కూడా రమ్మన్నారు. అయితే అంతా ఒకే అయిన తర్వాత సరే ఓకే నాయుడుగారు అని అన్నారు. నేను కదండీ అన్నాను. అలాగే రెడ్డిగారు అన్నారు .. కాదు అన్నాను. చౌదరిగారు అన్నారు.. నేను కాదు అన్నాను.
దాంతో అతనికి మ్యాటర్ అర్ధమైంది. దాంతో సరే రేపు రండి అడ్వాన్స్ ఇస్తాం అని చెప్పారు. కానీ ఆ తర్వాత ఆ ప్రొడక్షన్ నుంచి నాకు కాల్ రాలేదు అని చెప్పారు. ఇండస్ట్రీలో ఇప్పటికి క్యాస్ట్ ఫీలింగ్ ఉంది అని అన్నారు. ఆ ప్రొడక్షన్స్ నుంచి ఇంతవరకూ కాల్ రాలేదు అని చెప్పారు ప్రసాద్. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పుడు కమిటీ కుర్రాళ్ళు అనే సినిమా చేస్తున్నాడు ప్రసాద్. అలాగే సోషల్ మీడియాలో ప్రసాద్ చేసే వెబ్ సిరీస్ లు ట్రెండింగ్ లో ఉంటాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.