Maa Elections 2021: మా ఎన్నికల్లో సినిమాకు మించిన ట్విస్ట్ లు సాగుతున్నాయి. ఇప్పటికే ఎవరికీ వారు రాజకీయాలు మొదలు పెట్టేశారు. మైక్ కనిపిస్తే చాలు ఒకరి మీద ఒకరు విమర్శలతో విరుచుకుపడుతున్నారు. దీంతో ‘మా’లో లుకలుకలన్నీ బయటపడిపోతున్నాయి. ఈ సారి ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ – మంచు విష్ణు అధ్యక్ష పదవికి పోటీపడుతున్నారు. ఇప్పటికే ప్రకాష్ రాజ్ తన ప్యానల్‌ను కూడా అనౌన్స్ చేశారు. ఇక నరేష్ వర్గంలోని 100 ఓట్లు కూడా ఈ సారి ఎన్నికల్లో కీలకం కానున్నాయి. ఎవరు గెలిచినా 2021-24 సీజన్‌కి అధ్యక్షుడిగా ‘మా’ను ఏలుతారు. అనూహ్యంగా జీవిత ప్రకాష్ రాజ్ ప్యానల్ లో ప్రత్యక్షం అయ్యారు. దాంతో బండ్ల గణేష్ రంగంలోకి దిగారు జీవిత పై నేను పోటీ చేస్తా అంటూ ఆయన బయటకు వచ్చారు. ఇదిలా ఉంటే అప్పుడే ప్రచారాల పర్వం మొదలుపెట్టారు మా సభ్యులు.
సాధారణ ఎన్నికలను తలపించేలా ” మా” ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ తన ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. సినీ టీవీ కళాకారులు ఎక్కువగా కలుసుకునే ప్రాంతమైన యూసఫ్ గూడ గణపతి కాంప్లెక్స్ దగ్గర ప్రకాష్ రాజ్ తన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ రోజు లంచ్ సమావేశం ఏర్పాటు చేసి మా సభ్యులందరినీ ఆహ్వానించారు. మా అసోసియేషన్ లో వాళ్ళకున్న సమస్యలు తెలుసుకుని అలాగే వాళ్ళ సూచనలు తీసుకోవడం కోసం, మా అసోసియేషన్ కోసం తన ప్రణాళికలు వారికి తెలియజేసి వారి మద్దతు కోరడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేశారు. కేవలం 956 మంది సభ్యుల అసోసియేషన్ ఎన్నికల కోసం ప్రకాష్ రాజ్ ఇంత భారీ ఎత్తున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఒక పథకం ప్రకారం ముందుకు వెళ్లడం అనేది నిజంగా ఎన్నికలలో విజయాన్ని ఎంత సీరియస్ గా తీసుకున్నారో అర్థమవుతోంది. అక్టోబర్ 10న మా ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి.
మరిన్ని ఇక్కడ చదవండి :