యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ మూవీ తర్వాత ఆయన నటించిన ‘సాహో’, ‘రాధే శ్యామ్’, ‘ఆదిపురుష్’ సినిమాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు. ఇప్పుడు ఫ్యాన్స్ ఆశలన్ని కేవలం సలార్ సినిమాపైనే ఉన్నాయి. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవల విడుదలైన టీజర్ సినిమా ఏ రెంజ్ లో ఉండబోతుందో అర్థమయ్యింది. అయితే ఈ సినిమా గురించి నిత్యం నెట్టింట ఆసక్తికర విషయాలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా సలార్ ట్రైలర్ పై ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫీల్మ్ సర్కిల్లో వినిపిస్తుంది. ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.
‘సలార్’ సినిమా టీజర్ జూలై నెలలో విడుదలై రెబల్ స్టార్ అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇచ్చింది.. టీజర్‌లో ప్రభాస్ రెండు సెకన్ల పాటు కనిపించాడు. అయినా కూడా టీజర్‌లోని డైలాగ్ కారణంగా అది వైరల్‌గా మారింది. టీజర్ కంటే ఈ సినిమా ట్రైలర్ అద్భుతంగా ఉంటుందని ఇప్పుడు నెట్టింట చర్చ జరుగుతోంది. అయితే చిత్ర నిర్మాతలు మాత్రమే ట్రైలర్ విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు.
‘సలార్’ సినిమా ట్రైలర్ ను ఆగస్ట్ నెలలో విడుదల చేస్తామని చెప్పగా, ఆగస్ట్ నెల ముగుస్తున్నప్పటికీ, ట్రైలర్ తేదీని మాత్రం ప్రకటించలేదు. టాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్న వార్తల ప్రకారం సెప్టెంబర్ నాలుగో వారంలో అంటే సెప్టెంబర్ 17 తర్వాత విడుదల చేయనున్నారని తెలుస్తోంది. షారుఖ్ ఖాన్ నటించిన ‘జవాన్’ సెప్టెంబర్ మొదటి వారంలో విడుదల కానుంది. ఇక సినిమా ప్రమోషన్, విడుదలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ‘సలార్’ సినిమా ట్రైలర్ ను విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేసింది.
రెండు భాగాలుగా రూపొందిన ‘సలార్’ సినిమా మొదటి భాగాన్ని సెప్టెంబర్ 28న విడుదల చేయనున్నారు. ప్రభాస్‌తో పాటు మలయాళ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్, కన్నడ ప్రమోద్, మధు గురుస్వామి, గరుడ రామ్, జగపతి బాబు, టిను ఆనంద్ వంటి ప్రముఖ నటీనటులు ఈ సినిమాలో నటించారు. శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. సంగీతం రవి బస్రూరు, కెమెరామెన్ భువన్ గౌడ. మరికొద్ది రోజుల్లో ఈ సినిమా ప్రమోషన్ వర్క్ స్టార్ట్ కానుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.