AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kalki 2898 AD: డార్లింగ్ క్రేజ్ అంటే అట్లుంటది మరి.. విడుదలకు ముందే కల్కి రికార్డులు..

ఇక నిన్న విడుదలైన ఫస్ట్ సింగిల్ ఆకట్టుకుంటుంది. పంజాబీ సింగర్ దిల్జిత్ దోశాంజ్‏తో కలిసి స్టెప్పులేశారు ప్రభాస్. ఈ సాంగ్ ఆకట్టుకుంటుంది. మరోవైపు ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న బుజ్జి అండ్ భైరవ యానిమేషన్ సిరీస్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది.

Kalki 2898 AD: డార్లింగ్ క్రేజ్ అంటే అట్లుంటది మరి.. విడుదలకు ముందే కల్కి రికార్డులు..
Kalki 2898 Ad Movie
Rajitha Chanti
|

Updated on: Jun 18, 2024 | 10:40 AM

Share

పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తోన్న కల్కి 2898 ఏడీ మరికొన్ని రోజుల్లో రిలీజ్ కాబోతుంది. డైరెక్టర్ నాగ్ అశ్విన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలకు చెందిన స్టార్స్ కీలకపాత్రలు పోషిస్తుండడంతో మరింత హైప్ క్రియేట్ అయ్యింది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ఓ రేంజ్ బజ్ నెలకొంది. అటు రిలీజ్ టైమ్ దగ్గరపడుతున్న కొద్ది మరింత హైప్ క్రియేట్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ మూవీపై ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఇక నిన్న విడుదలైన ఫస్ట్ సింగిల్ ఆకట్టుకుంటుంది. పంజాబీ సింగర్ దిల్జిత్ దోశాంజ్‏తో కలిసి స్టెప్పులేశారు ప్రభాస్. ఈ సాంగ్ ఆకట్టుకుంటుంది. మరోవైపు ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న బుజ్జి అండ్ భైరవ యానిమేషన్ సిరీస్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది.

కల్కి ప్రమోషన్స్ ముందు నుంచి సరికొత్తగా ప్లాన్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో ప్రభాస్ నడిపిన బుజ్జి కారు దేశమంత చక్కర్లు కొడుతుంది. చెన్నై, ఢిల్లీ ఇలా ప్రధాన నగరాల్లో రైడ్ చేస్తూ జనాలను ఆకర్షిస్తుంది. జూన్ 27న కల్కి సినిమా ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ క్రమంలో తాజాగా ఓ రికార్డ్ క్రియేట్ చేసింది ఈ మూవీ. ప్రీ సేల్స్ తోనే దాదాపు రెండు మిలియన్స్ డాలర్లను నార్త్ అమెరికాలో రాబట్టింది. లాంగ్ రన్ లో కనీసం మిలయన్ డాలర్స్ కూడా కొల్లగొట్టడానికే ట్రై చేసే మేకర్స్.. ఇప్పుడు కల్కి సినిమాకు మాత్రం ప్రీ సేల్స్ తోనే రెండు మిలియన్స్ రాబట్టేశారు. విడుదలకు పది రోజుల ముందుగానే ఈ రేంజ్ కలెక్షన్స్ రాబట్టడంతో .. ఇక ఓపెనింగ్ డే కలెక్షన్స్ ఎలా ఉంటాయో అంటున్నారు ఫ్యాన్స్.

కచ్చితంగా కల్కి డే వన్ రికార్డ్స్ బద్దలవ్వడం ఖాయమంటున్నారు. ఆదిపురుష్, సలార్ సినిమాలు 130, 150 కోట్ల వరకు ఓపెనింగ్స్ సాధించాయి.. ఈ లెక్కన కల్కి సినిమా రెండు వందల కోట్ల వరకు ఓపెనింగ్స్ రావొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ తోపాటు.. అమితాబ్ బచ్చన్, దిశా పటానీ, దీపికా పదుకొణె, కమల్ హాసన్ కీలకపాత్రలు పోషించగా.. రూ. 600 కోట్ల బడ్జెట్ తో అశ్వనీదత్ నిర్మించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..