Adipurush: ప్రభాస్ ఫ్యాన్స్‌కు డబుల్ కిక్ ఇచ్చే న్యూస్.. ఆదిపురుష్‌లో మరో పాత్రలో డార్లింగ్
సాహు, రాధేశ్యామ్ ఫ్లాప్‌ల తర్వాత హిట్ అందుకున్నారు ప్రభాస్. పాత కథ.. పాత క్లైమాక్స్ కానీ స్క్రీన్ ప్లే అద్భుతంగా పండించారు డైరెక్టర్. కథకు గ్రాఫిక్ తోడు కావడంతో అభిమానులు ఫిదా అవుతున్నారు.

వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ అయిన ఆదిపురుష్ హిట్ టాక్ అందుకుంది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. సాహు, రాధేశ్యామ్ ఫ్లాప్‌ల తర్వాత హిట్ అందుకున్నారు ప్రభాస్. పాత కథ.. పాత క్లైమాక్స్ కానీ స్క్రీన్ ప్లే అద్భుతంగా పండించారు డైరెక్టర్. కథకు గ్రాఫిక్ తోడు కావడంతో అభిమానులు ఫిదా అవుతున్నారు. థియేటర్ల దగ్గర అభిమానుల సందడి కనిపిస్తోంది. సినిమా అదుర్స్ అంటూ కేకులు కటింగ్ చేస్తూ బాణా సంచా కాలుస్తూ సంబరాల్లో మునిగితేలుతున్నారు.
ఆదిపురుష్ మూవీలో ఊహకు అందని విజువల్స్.. ప్రభాస్ రాముడిగా తెర అద్బుతంగా కనిపించారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మెలోడిస్ బ్యూటిఫుల్‌గా ఉన్నాయంటున్నారు థియేటర్ల నుంచి బయటకు వస్తున్నారు ప్రేక్షకులు. ఇదిలా ఉంటే ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ డబుల్ కుష్ అయ్యే వార్త ఒకటి ఇప్పుడు హల్ చల్ చేస్తోంది.
ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రతో పాటు మరో పాత్రలోనూ కనిపించారని తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్ లో కనిపించారట. రాముడిగా కనిపించిన ప్రభాస్ ఆయన తండ్రి దశరధుడి పాత్రలోనూ కనిపించి ఆకట్టుకుంటారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.




