
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. బాహుబలి తర్వాత డార్లింగ్ ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడు చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అందులో రాజా సాబ్ సినిమా ఒకటి. డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా పై ఇప్పటికే విపరీతమైన హైప్ నెలకొంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, ట్రైలర్ విడుదల కాగా.. మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ట్రైలర్ తో సినిమాపై అంచనాలు పీక్స్ కు చేరింది. ఈ మూవీ ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల చేశారు మేకర్స్.
ఇవి కూడా చదవండి : Suryavamsham : హీరోగా సూర్యవంశం సినిమా చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు ఎలా ఉన్నాడో చూశారా.. ?
ఇటీవలే ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ సాంగ్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రాజాసాబ్ ఫస్ట్ సింగిల్ విడుదలైంది. ఈ పాటను తమన్ అద్భుతంగా కంపోజ్ చేశాడు. పాట లేటుగా వచ్చిన కూడా డార్లింగ్ ఫ్యాన్స్ ఎంజాయ్ చేసేలా ఉంది. రామ జోగయ్య శాస్త్రి ఈ పాటకు అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు.
ఇవి కూడా చదవండి : Actress : కోట్లలో అప్పులు.. తినడానికి తిండి లేక తిప్పలు.. ఇప్పుడు వందల కోట్లకు మహారాణి ఈ బిగ్ బాస్ బ్యూటీ..
ఫుల్ జోష్ మీద సాగే ఈ పాటలో ప్రభాస్ ఎనర్జిటిక్ స్టెప్పులు అదిరిపోయాయి. చాలా కాలం తర్వాత ప్రభాస్ ను ఇలా ఫుడ్ సాంగ్ లో చూడడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇదెలా ఉంటే.. ఆదివారం స్పిరిట్ మూవీ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.
ఇవి కూడా చదవండి : Actress : తెలుగులో తోపు హీరోయిన్.. ఇప్పుడు బడా నిర్మాత.. పవన్ కళ్యాణ్, మహేష్ బాబుతో బ్లాక్ బస్టర్ హిట్స్..
ఇవి కూడా చదవండి : Cinema : రూ.32 కోట్లు పెట్టి తీస్తే రూ.440 కోట్ల కలెక్షన్స్.. ఆరేళ్లుగా సంచలనం.. ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్..