
కొందరు నటులు తమ స్టార్‌డమ్ పెరిగినా, అంతకుముందు ఉన్న స్నేహబంధాలను, వ్యక్తిత్వాన్ని మార్చుకోరు. వారిలో ప్రముఖ నటుడు ప్రభాస్ ఒకరు. “బాహుబలి” చిత్రం తర్వాత ప్రభాస్ గ్లోబల్ స్టార్‌గా మారినప్పటికీ, ఆయన తన చుట్టూ ఉన్నవారితో, ముఖ్యంగా తన పాత స్నేహితులతో ఎటువంటి భేదాభిప్రాయాలు చూపకుండా, వారితో సన్నిహితంగా ఉంటారు. తనతో పనిచేసేవారిని ఎన్నడూ తక్కువ చేసి చూడరు. ఆయన ఎప్పుడూ ఒకే ప్లేస్‌లో ఉంటారని, ఎటువంటి వేరియేషన్ ఉండదని ఆయన సన్నిహితులు చెబుతారు. దీని గురించి అడిగితే ఆయన నవ్వుతారని, కొత్తవారిని సులభంగా స్వీకరించలేరని, కానీ పాత అనుబంధాలను వదులుకోలేరని ప్రభాస్ బెస్ట్ ఫ్రెండ్ ప్రభాస్ శీను అన్నారు.
ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ప్రభాస్ వ్యక్తిత్వం గురించి అనేక జ్ఞాపకాలు ఉన్నప్పటికీ, ఆయన డైట్, ఆకలికి సంబంధించిన ఒక సంఘటన ప్రత్యేకంగా నిలుస్తుంది. ప్రభాస్ ఒకసారి కఠినమైన డైట్‌లో ఉన్నప్పుడు, ఎంతో కష్టపడి కడుపు కట్టుకొని ఉన్నారు. ఇంతటి ఆజానుబాహుడైన వ్యక్తి, ఆహారం లేకుండా ఎలా ఉంటారో అని ఆయన్ను చూసినవారికి అనిపించేది. అయితే డైట్ అయిపోయిన తర్వాత ఆయన ఆహారం తీసుకోవడంలో ఎటువంటి పరిమితులు ఉండవని అన్నారు.
ఎక్కువ మంది చదివినవి: Trending Song : 25 ఏళ్లుగా యూట్యూబ్‌ను ఊపేస్తున్న సాంగ్.. 90’s యూత్‌కు ఇష్టమైన పాట.. ఇప్పటికీ ట్రెండింగ్..
ఇలాంటి ఓ సంఘటన “అడవిరాముడు” సినిమా షూటింగ్ సమయంలో తలకోన అటవీ ప్రాంతంలో జరిగింది. బి. గోపాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్ర షూటింగ్ జరుగుతుండగా, ఒక రోజు సడెన్‌గా షూటింగ్ రద్దు అయింది. అప్పుడు ప్రభాస్ వెంటనే తన డైట్ క్యాన్సిల్ అయిందని ప్రకటించి, నాటుకోడి కూరతో అన్నం కావాలని కోరారు. తలకోన ఒక డీప్ ఫారెస్ట్, నక్సల్స్ ఏరియా కావడంతో రాత్రి 6 గంటల తర్వాత ఎవరినీ అడవిలోకి అనుమతించరు. సీఆర్‌పీఎఫ్ పోలీసులు సెక్యూరిటీని పర్యవేక్షిస్తారు. కనీసం చిప్స్ కూడా దొరకని ఆ ప్రాంతంలో, ప్రొడక్షన్ టీమ్ కూడా రాత్రి 9:30 గంటలకల్లా వెళ్లిపోయింది.
ఎక్కువ మంది చదివినవి: Jagapathi Babu : వెయ్యి కోట్లు పోగొట్టుకున్నాను.. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఆస్తి ఇంతే.. జగపతి బాబు కామెంట్స్..
అప్పుడు ఒక ఆలోచన వచ్చింది. సినిమా సెట్‌లో నాజర్ గారి గూడెం సెట్ ఉందని, అందులో కోళ్లు, మేకలు ఉంటాయని గుర్తుకు తెచ్చుకున్నారు. వెంటనే రాత్రి 9:30 గంటలకు వాహనంలో 10 కిలోమీటర్లు లోపలికి వెళ్లి, టార్చ్ లైట్ సహాయంతో ఒక కోడిని పట్టుకొచ్చామని అన్నారు. ఆ కోడికోసి, వండి, ప్రభాస్‌కు వడ్డించడంతో, ఆయన సంతృప్తిగా భోజనం చేశారని చెప్పుకొచ్చారు.
ఎక్కువ మంది చదివినవి: Soundarya: అప్పట్లో సౌందర్య రెమ్యునరేషన్ అంతే.. ఒక్కో సినిమాకు ఎంత తీసుకునేదంటే.. ?
Prabhas Sreenu
ఎక్కువ మంది చదివినవి: Rambha: హీరోయిన్ రంభకు ఇంత పెద్ద కూతురు ఉందా.. ? అందంలో తల్లిని మించిపోయింది.. ఫోటోస్ వైరల్..