Salaar: ప్రభాస్ మేనియా.. దిమ్మతిరిగే స్థాయిలో సలార్ డిజిటల్ రైట్స్..

రీసెంట్ గా వచ్చిన ఆదిపురుష్ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. భారీ అంచనాలు పెట్టున్న ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర సత్తా చూపలేకపోయింది. రామాయణం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడిగా నటించాడు.

Salaar: ప్రభాస్ మేనియా.. దిమ్మతిరిగే స్థాయిలో సలార్ డిజిటల్ రైట్స్..
Salaar

Updated on: Jul 15, 2023 | 8:09 AM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా ఇప్పుడు అన్ని సెన్సేషన్ గా మారిపోతున్నాయి. బాహుబలి సినిమా దగ్గర నుంచి ప్రభాస్ అన్ని భారీ సినిమాలే చేస్తున్నారు. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్, ఇప్పుడు సలార్ ఇలా వరుసగా భారీ సినిమాలు చేస్తూ వస్తున్నాడు. రీసెంట్ గా వచ్చిన ఆదిపురుష్ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. భారీ అంచనాలు పెట్టున్న ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర సత్తా చూపలేకపోయింది. రామాయణం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడిగా నటించాడు. ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడంతో ఇప్పుడు ప్రభాస్ అభిమానులంతా సలార్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రశాంత్ నీల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. కేజీఎఫ్ సినిమాతో సంచలన విజయం అందుకున్న ప్రశాంత్ నీల్ ఇప్పుడు సలార్ తో రానున్నాడు.

ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ వీడియో రికార్డు స్థాయిలో వ్యూస్ ను రాబట్టి ట్రెండింగ్ లో నిలిచింది. అంతకు ముందు రిలీజ్ అయిన పోస్టర్స్ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేశాయి.

ఇక రీసెంట్ గా వచ్చిన టీజర్ ఆ అంచనాలు ఆకాశానికి చేర్చింది. ఇదిలా ఉంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ రికార్డ్ స్థాయిలో అమ్ముడయ్యాయని తెలుస్తోంది. సలార్ డిజిటల్ హక్కుల కోసం గట్టిగానే పోటీ జరిగిందని తెలుస్తోంది. సలార్  డిజిటల్ రైట్స్ దాదాపు 200 కోట్ల వరకు పలుకుతున్నాయని టాక్ నడుస్తోంది. సెప్టెంబరు 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది ఈ సినిమా. ఈ మూవీ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది.