Salaar Trailer : డైనోసార్ వచ్చేసింది.. దుమ్మురేపిన సలార్ ట్రైలర్.. రికార్డులు బద్దలు కావాల్సిందే

|

Dec 01, 2023 | 7:27 PM

కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కేజీఎఫ్ సినిమాతో సంచలన విజయం అందుకున్న ప్రశాంత్ నీల్. ఇప్పుడు సలార్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. దాంతో ఈ సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. దాంతో ఏ సినిమా ఎప్పుడెప్పడు రిలీజ్ అవుతుందని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ప్రశాంత్ నీల్ ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నాడు.

Salaar Trailer : డైనోసార్ వచ్చేసింది.. దుమ్మురేపిన సలార్ ట్రైలర్.. రికార్డులు బద్దలు కావాల్సిందే
Salaar
Follow us on

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ సలార్. ఈ సినిమా కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కేజీఎఫ్ సినిమాతో సంచలన విజయం అందుకున్న ప్రశాంత్ నీల్. ఇప్పుడు సలార్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. దాంతో ఈ సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. దాంతో ఏ సినిమా ఎప్పుడెప్పడు రిలీజ్ అవుతుందని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ప్రశాంత్ నీల్ ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్లతో.. సినిమా పై అంచనాలు పెరిగిపోయాయి. తాజాగా సలార్ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

ముందు నుంచి ఈ సినిమాకు ఉన్న హైప్ ను రెట్టింపు చేస్తూ ఈ ట్రైలర్ ఉంది. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు. కేజీఎఫ్ ను మించి యాక్షన్ సీన్స్ తో ఈ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. అలాగే ఈ ట్రైలర్ 3 నిమిషాల 47 సెకండ్స్ ఉంది. ఈ ట్రైలర్ దెబ్బకు సినిమా పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

సలార్ సినిమాతో ప్రభాస్ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. ఐదు భాషల్లో ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది సలార్ మూవీ. యుఎస్‌లో ఒకరోజు ముందు అంటే డిసెంబర్ 21న రిలీజ్ చేయనున్నారు. సలార్ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది అలాగే మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే యుఎస్ లో సలార్ పై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ ట్రైలర్ పై మీరూ ఓ లుక్కేయండి.

సలార్ మూవీ ట్రైలర్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.