AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kalki 2898 AD: బాక్సాఫీస్ వద్ద కల్కి సంచలనం.. నాలుగు రోజుల్లోనే రూ.500 కోట్లు..

ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కలెక్షన్లు భారీగానే రాబడుతున్నాయి. నాలుగో రోజు ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర రూ.85 కోట్లు వసూల్ చేసింది.ప్రభాస్ హీరోగా నటించిన 'కల్కి 2898 AD'లో దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ఇలా స్టార్ కాస్ట్ నటించిన కల్కి సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమా ఐదు భాషల్లో విడుదలైంది. ఈ సినిమా అన్ని భాషల్లో కలిపి ఇండియాలో రూ. 302 కోట్లు వసూలు చేసింది.

Kalki 2898 AD: బాక్సాఫీస్ వద్ద కల్కి సంచలనం.. నాలుగు రోజుల్లోనే రూ.500 కోట్లు..
Kalki 2898 Ad
Rajeev Rayala
|

Updated on: Jul 01, 2024 | 8:32 AM

Share

‘కల్కి 2898 ఏడి’ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతుంది. ఇప్పటికే భారీ విజయాన్ని నమోదు చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు కలెక్షన్స్ పరంగాను రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. ఈ సినిమా జూన్ 27న విడుదలైంది.  ప్రస్తుతం ఈ సినిమా విడుదలై నాలుగు రోజులు గడుస్తున్నా భారతీయ బాక్సాఫీస్ వద్ద 300 కోట్ల రూపాయల వసూళ్ల దిశగా అడుగులు వేసింది. ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కలెక్షన్లు భారీగానే రాబడుతున్నాయి. నాలుగో రోజు ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర రూ.85 కోట్లు వసూల్ చేసింది.ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 AD’లో దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ఇలా స్టార్ కాస్ట్ నటించిన కల్కి సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమా ఐదు భాషల్లో విడుదలైంది. ఈ సినిమా అన్ని భాషల్లో కలిపి ఇండియాలో రూ. 302 కోట్లు వసూలు చేసింది. ఆదివారం నాటికి ఈ సినిమా రూ.85 కోట్లు కోట్ల రూపాయలను రాబట్టింది.

‘కల్కి 2898 ఏడీ’ మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ.415 కోట్లు వసూలు చేసింది. నాలుగో రోజు 500కోట్లు వసూల్ చేసింది. దాంతో కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా వసూళ్లు రూ.500 కోట్లు దాటుతాయి. ఇక కల్కి సినిమాను మహాభారత నేపథ్యంలో తెరకెక్కించాడు దర్శకుడు నాగ్ అశ్విన్. ఈ సినిమాలో ప్రభాస్ పాత్రతో పాటు అమితాబ్ బచ్చన్ పాత్ర కూడా సినిమాకు హైలైట్ అనే చెప్పాలి. కల్కి సినిమాను మరికొన్ని పార్టులుగా తెరకెక్కించనున్నాడు దర్శకుడు.

సినిమాకి రెండో పార్ట్ ఉందని హింట్ ఇస్తూ..క్లైమాక్స్ ను ఎండ్ చేశాడు. ఈ చిత్రానికి సంబంధించిన రెండో భాగం షూటింగ్ జరుగుతోంది. 60 పూర్తయినట్లు ఇటీవలే నిర్మాత అశ్వినీదత్ తెలిపారు. ఇక ఈ సినిమా బాలీవుడ్ లోనూ దూసుకుపోతోంది. అక్కడ కూడా ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతోంది. అలాగే కల్కి సినిమా వెయ్యి కోట్లు వసూల్ చేయడం పెద్ద కష్టమేమి కాదు అంటున్నారు విశ్లేషకులు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. డిగ్రీ అర్హతతో రైల్వేశాఖలో ఉద్యోగాలు
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. డిగ్రీ అర్హతతో రైల్వేశాఖలో ఉద్యోగాలు
బెంగళూరు ట్రాఫిక్.. ఈ నిజం తెలిస్తే IT ఉద్యోగుల దిమ్మతిరిగిపోద్ది
బెంగళూరు ట్రాఫిక్.. ఈ నిజం తెలిస్తే IT ఉద్యోగుల దిమ్మతిరిగిపోద్ది
ఐపీఎల్ వేలంలోకి నయా విధ్వంసం ఎంట్రీ.. అన్ని రికార్డులు బద్దలే..!
ఐపీఎల్ వేలంలోకి నయా విధ్వంసం ఎంట్రీ.. అన్ని రికార్డులు బద్దలే..!
క్యాండీ క్రష్‌లో బీహార్‌ యువకుడి ప్రపంచ రికార్డ్!
క్యాండీ క్రష్‌లో బీహార్‌ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విమానంలో ఏయే వస్తువులను తీసుకెళ్లవచ్చు..? వీటికి నో ఎంట్రీ
విమానంలో ఏయే వస్తువులను తీసుకెళ్లవచ్చు..? వీటికి నో ఎంట్రీ
ట్రాక్‌ మధ్యలో కంకరాళ్లు ఎందుకు వేస్తారో తెలుసా? వాటిని ఏమంటారంటే
ట్రాక్‌ మధ్యలో కంకరాళ్లు ఎందుకు వేస్తారో తెలుసా? వాటిని ఏమంటారంటే
నమ్మితే నట్టేట ముంచాడు.. అతని చేతిలో దారుణంగా మోసపోయిన శివారెడ్డి
నమ్మితే నట్టేట ముంచాడు.. అతని చేతిలో దారుణంగా మోసపోయిన శివారెడ్డి
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!