AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabahas: తన ప్రొడ్యుసర్‌ కుమారుడికి ప్రభాస్‌ పంపిన బహుమతి చూశారా.? ‘థ్యాంక్యూ డార్లింగ్‌’ అంటూ ట్వీట్‌..

Prabhas Gift To Sumanth Ahwin: టాలీవుడ్‌కు చెందిన అగ్ర నిర్మాతల్లో ఒకరైన ఎమ్‌ఎస్‌ రాజు కుమారుడు.. హీరో సుమంత్‌ అశ్విన్‌ వివాహం జరిగిన విషయం తెలిసిందే. ఈ నెల 13న అత్యంత దగ్గరి బంధువుల..

Prabahas: తన ప్రొడ్యుసర్‌ కుమారుడికి ప్రభాస్‌ పంపిన బహుమతి చూశారా.? 'థ్యాంక్యూ డార్లింగ్‌' అంటూ ట్వీట్‌..
Narender Vaitla
|

Updated on: Feb 18, 2021 | 1:47 PM

Share

Prabhas Gift To Sumanth Ahwin: టాలీవుడ్‌కు చెందిన అగ్ర నిర్మాతల్లో ఒకరైన ఎమ్‌ఎస్‌ రాజు కుమారుడు.. హీరో సుమంత్‌ అశ్విన్‌ వివాహం జరిగిన విషయం తెలిసిందే. ఈ నెల 13న అత్యంత దగ్గరి బంధువుల సమక్షంలో దీపికను వివాహం చేసుకున్నాడు. అయితే కరోనా నేపథ్యంలో ఈ సినిమాకు సినీ తారలు పెద్దగా ఎవరూ హాజరుకాలేదు. ఇదిలా ఉంటే పెళ్లికి హాజరుకాకపోయినా సుమంత్‌కు ఆకట్టుకునే బహుమతి పంపించాడు… యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌. ఓ ఫ్లవర్‌ బొకేతోపాటు పట్టు వస్త్రాలు పంపిస్తూ.. ‘హ్యాపీ మ్యారేజ్‌ లైఫ్‌ సుమంత్‌ ఫ్రమ్‌: ప్రభాస్‌’ అనే సందేశాన్ని అందించాడు. ఈ విషయాన్ని నిర్మాత సుమంత్‌ తండ్రి ఎమ్‌ఎస్‌ రాజు ట్విట్టర్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. ఇదిలా ఉంటే ఎమ్‌ఎస్‌రాజుకు ప్రభాస్‌కు మధ్య మంచి సంబంధాలు ఉన్నాయన్న విషయం తెలిసిందే. ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన వర్షం, పౌర్ణమి సినిమాలకు ఎమ్‌ఎస్‌ రాజు నిర్మాతగా వ్యవహరించాడు. ప్రభాస్‌ కెరీర్‌లో తొలి కమర్షియల్‌ విజయం ఎమ్‌ఎస్‌ రాజు నిర్మాతగా తెరకెక్కిన ‘వర్షం’తోనే అందుకున్నాడు. ఈ కారణంగానే ఎమ్‌ఎస్‌ రాజుపై ఉన్న ప్రత్యేక అభిమానంతోనే ప్రభాస్‌ ఈ బహుమతిని అందించాడు.

Also Read: Prabhas Wiki: భారతీయ చలనచిత్ర ‘బాహుబలి’.. యూనివర్సల్ హీరోగా ఎదుగుతున్న తెలుగు గని.. ప్రభాస్