సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక వీడియో.. వైరల్ అవుతూనే ఉంటుంది. అయితే అది పాతదేకావచ్చు.. లేద కొత్తదే కావచ్చు! అలా తాజాగా రానా (Rana) ప్రభాస్ (Prabhas)కు సబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ (Viral) అవుతోంది. వైరల్ అవ్వడమే కాదు.. డార్లింగ్, రానా ఫ్యాన్స్ ను తెగ ఆకట్టుకుంటోంది. అయితే అందర్నీ ఎందుకు అంతలా ఆ వీడియో.. ఆకట్టుకుంటోందో తెలియాలంటే.. ఈ స్టోరీని ఫాలో కావాల్సిందే!
అప్పటి నుంచి ఇప్పటి వరకు సెలబ్రిటీ టాక్ షోలు చాలా పాపులర్. మెయిన్ం స్ట్రీమ్ ఎంటర్ టైన్మెంట్ ఛానెల్స్‌కు ఇవే టీఆర్‌పీ గెయినర్. అయితే అలాంటి ఓ టాక్ షోకు బాహుబలి (Bahaubali) సినిమా తరువాత రానా గెస్ట్ గా వెళ్లారు. వెళ్లడమే కాదు.. ఆ షోలో బాహుబలి తాలూకు జ్ఙాపకాలను తన ఫ్యాన్స్ అండ్ పాలోవర్స్ తో పంచుకున్నారు. తన పర్సనల్ అండ్ ప్రైవేట్ లైఫ్ కు సంబంధించిన విషయాలను షేర్ చేసుకున్నారు. తన అప్ కమింగ్ సినిమాల గురించి కూడా హింట్లు ఇచ్చారు. ఈ క్రమంలోనే యాంకర్ కోరిక మేరకు డార్లింగ్ ప్రభాస్ కు ప్రాంక్ కాల్ చేశారు రానా..!
తను పోలీస్ స్టేషన్లో చిక్కుకుపోయినట్టు.. వచ్చి నన్ను విడిపించాల్సింది నువ్వే అన్నట్టు.. ప్రభాస్ కు ఫోన్ చేసి చెప్పారు రానా..! అందుకు ప్రభాస్ “బావా… బాహుబలితో యాక్ట్ చేశా అని చెప్పు.,. వాళ్లే వదిలేస్తారు” అని చెప్పి రానాకు షాకిచ్చారు. షాకివ్వడమే కాదు.. షోలో అందర్నీ తన ఫన్నీ పంచ్‌తో నవ్వించారు. అయితే ఇప్పుడీ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. మరో సారి ప్రభాస్ రానా ఫ్రెండ్ షిప్ కి అందర్నీ పడిపోయేలా చేస్తోంది.