‘కల్కి 2898 AD’ ఈ ఏడాది అత్యంత ఖరీదైన చిత్రం. ప్రభాస్ నటించిన ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్‌తో పాటు దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ కనిపించనున్నారు. వీరే కాకుండా ఈ మూవీలో మరికొంత మంది నటీనటులు అతిధి పాత్రలు పోషిస్తున్నారనే టాక్ వినిపిస్తుంది. ఈ ఏడాది జూన్ 27న ఈ సినిమాను గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా తాజాగా హైదరాబాద్‌లో ఓ గ్రాండ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భైరవ పాత్రలో నటిస్తున్న ప్రభాస్ కారు బుజ్జిని అభిమానులకు పరిచయం చేశారు. ఈ సినిమా ప్రమోషన్‌కు సంబంధించిన సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే ఇప్పటి వరకు ‘కల్కి 2898 AD’ ఈవెంట్‌లో ప్రభాస్ మినహా మరే ఇతర స్టార్ కాస్ట్ కనిపించలేదు.
ఈ సినిమాలో దీపికా పదుకొణె కూడా ఓ కీలక పాత్రలో కనిపించనుంది. ప్రభాస్‌తో దీపికా పదుకొణెని చూసేందుకు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం దీపికా పదుకొణె చేతిలో మరిన్ని ప్రాజెక్ట్స్ ఉండగా.. ప్రెగ్నెన్సీకి ముందే అన్ని సినిమాల వర్క్ ఫినిష్ చేయాలనుకుంటోంది. అయితే అంతలోనే దీపికా పదుకొనెపై ప్రభాస్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినీజోష్ నివేదిక ప్రకారం.. దీపికా సోషల్ మీడియాలో గానీ.. మరెక్కడైన గానీ కల్కి సినిమా గురించి ఎలాంటి కామెంట్స్ చేయడం లేదు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దీపికా ప్రభాస్ నటిస్తున్న కల్కి ప్రాజెక్ట్ గురించి మాట్లాడలేదు. ఓవైపు చిత్రయూనిట్ కల్కి సినిమా ప్రమోషన్స్ వేగంగా ప్రయత్నిస్తుండగా.. దీపికా మాత్రం కల్కి సినిమాను ఏమాత్రం ప్రమోట్ చేయడం లేదంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
ప్రస్తుతం దీపికా తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ షూటింగ్స్ లో చాలా బిజీగా ఉంది. మరోవైపు దీపికా ప్రెగ్నెంట్‌గా ఉండడంతో సినీ ఈవెంట్స్, ప్రమోషన్లకు దూరంగా ఉంటుంది. ఈ కారణంగానే ఇప్పుడు ప్రభాస్ నటించిన కల్కి సినిమా ప్రచార కార్యక్రమాల్లో దీపికా పాల్గొనడం లేదని తెలుస్తోంది. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ మూవీలో అమితాబ్, దిశా పటానీ, కమల్ హాసన్ నటించగా.. త్వరలోనే వీరు ప్రమోషన్లలో పాల్గొంటారని తెలుస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.