AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: మళ్లీ నోరుజారిన సప్తగిరి.. మండిపడుతోన్న ప్రభాస్ ఫ్యాన్స్.. ఏం జరిగిందంటే? వీడియో ఇదిగో

గతంలో ఓ విషయంలో ప్రభాస్ అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు కమెడియన్ సప్తగిరి. తాజాగా ఇప్పుడు మరోసారి డార్లింగ్ ఫ్యాన్స్ కు టార్గెట్ గా మారాడీ హాస్య నటుడు.సప్తగిరిని ట్రోల్ చేస్తూ ప్రభాస్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

Prabhas: మళ్లీ నోరుజారిన సప్తగిరి.. మండిపడుతోన్న ప్రభాస్ ఫ్యాన్స్.. ఏం జరిగిందంటే? వీడియో ఇదిగో
Saptagiri, Prabhas
Basha Shek
|

Updated on: May 11, 2026 | 4:23 PM

Share

నటుడు సప్తగిరి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. జబర్దస్త్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఆ తర్వాత కమెడియన్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. పరుగు, వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, దృశ్యం, ఏక్ మినీ కథ, తెనాలి రామకృష్ణ వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో హాస్య నటుడిగా మెప్పించాడు. ఆ తర్వాత వజ్ర కవచధర గోవింద సప్తగిరి LLB వంటి చిత్రాల్లో హీరోగానూ నటించారు. అయితే ఈ సినిమాలు పెద్దగా ఆడలేదు. దీంతో మళ్లీ కమెడియన్ గా, సహాయక నటుడిగా బిజీ అయ్యాడు సప్తగిరి. ఆ మధ్యన ప్రభాస్ నటించిన ది రాజాసాబ్ లోనూ ఓ కీలక పాత్రలో నటించాడీ కమెడియన్. తాజాగా అతను నటించిన మరో చిత్రం పురుషః. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 22 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లలో భాగంగా చిత్ర బృందం మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. సప్తగిరి కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యాడు. ఈ సందర్భంగా తన సినిమా జర్నీ గురించి మాట్లాడుతూ బాగా ఎమోషనల్ అయ్యాడు సప్తగిరి. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ మధ్యలో అతను చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రభాస్ అభిమానులకు కోపం తెప్పించాయి. ఇంతకీ సప్తగిరి ఏం మాట్లాడాడంటే?

నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చి సుమారు 18 ఏళ్లు అయ్యిపోయింది. చేసిన పాత్రలే మళ్లీ చేస్తున్నాను. అప్పుడప్పుడు కొత్త కొత్త పాత్రలు కూడా ఎంపిక చేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం ఆర్థికంగా స్థిరపడ్డాను. అందుకే డబ్బుల కోసం కాకుండా వృత్తిపరంగా సంతృప్తి దొరికే పాత్రలను ఎంచుకోవాలని ప్రయత్నిస్తున్నాను. రెగ్యులర్ గా కామెడీ పాత్రలే కాకుండా ఎమోషనల్ పండించే పాత్రలు కూడా చేయాలనీ చూస్తున్నాను. ఎప్పుడో ఏదో ఒక డైరెక్టర్ మంచి క్యారెక్టర్ రాస్తారు’ అని మాట్లాడారు సప్తగిరి. ఇక్కడివరకు బాగానే ఉంది కానీ ఆ తర్వాత ప్రభాస్ రాజాసాబ్ సినిమాను ప్రస్తావిస్తూ.. ‘ఇప్పుడు కమెడియన్‌గా కూడా వరుస సినిమాలను చేస్తున్నాను. ఈ మధ్యే సరస్వతి, ది రాజాసాబ్, కొక్కరొక్కో లాంటి సినిమాలు చేశాను. కాకపోతే అవి చిన్నస్థాయి సినిమాలు కాబట్టి సరిగ్గా ప్రజలకు రీచ్ అవ్వడం లేదు. పెద్ద సినిమాలు అయితే రీచ్ బాగా ఉంటుంది’ అని అన్నాడు సప్తగిరి. అంతే నటుడిపై ప్రభాస్‌ ఫ్యాన్స్‌కి కోపం వచ్చింది.

ఇవి కూడా చదవండి

దాదాపు రూ. 350 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన ది రాజాసాబ్ మూవీని చిన్న సినిమా అంటావా? అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ సప్తగిరిపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. కాగా గతంలో రాజాసాబ్‌ మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో ఇదే సప్తగిరి మాట్లాడుతూ ‘ఈ చిత్రం రూ. 1000 కోట్లు కాదు.. రూ. 2000 కోట్లు వసూలు చేస్తుంది’ అని చెప్పాడు. తీరా చూస్తే ఇప్పుడేమో చిన్న సినిమా అనడం ప్రభాస్ ఫ్యాన్స్ ను హర్ట్ చేసింది. అయితే మరికొంతమంది మాత్రం ఏదో ఫ్లోలో అలా అన్నాడు కానీ.. ప్రభాస్‌ సినిమాను కించపరిచే ఉద్దేశం సప్తగిరికి లేదని అతనికి మద్దతు తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు.

వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us