The Raja Saab: మరీ ఇలా ఉన్నారేంట్రా? ప్రభాస్ ‘ది రాజసాబ్’ థియేటర్‌లోకి మొసళ్లు.. వీడియో ఇదిగో

ప్రభాస్ ‘ది రాజా సాబ్’ సందడి మొదలైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో గురువారం (జనవరి 8) రాత్రి నుంచే డార్లింగ్ మూవీ ప్రీమియర్స్ పడ్డాయి. దీంతో ప్రభాస్ అభిమానులు తెగ హంగామా చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

The Raja Saab: మరీ ఇలా ఉన్నారేంట్రా? ప్రభాస్ ది రాజసాబ్ థియేటర్‌లోకి మొసళ్లు.. వీడియో ఇదిగో
The Raja Saab Movie

Updated on: Jan 09, 2026 | 6:15 AM

ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ సినిమా ప్రీమియర్లు పడిపోయాయి. ఓవర్ సీస్ తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో గురువారం (జనవరి 8) రాత్రి నుంచే ది రాజా సాబ్ సినిమా షోస్ ప్రారంభమయ్యాయి. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. థియేటర్లలో ప్రభాస్ కటౌట్లతో, పోస్టర్లతో రచ్చ రచ్చ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంత మంది డార్లింగ్ ఫ్యాన్స్ ఓ థియేటర్ లోకి మొసళ్లను కూడా తీసుకువచ్చారు. వాటిని చేతులతో పట్టుకుని థియేటర్‌ మొత్తం కలియ తిరిగారు. మొసళ్లు అనగానే నిజమైనవి అనుకున్నారేమో! కాదండోయ్. పెద్ద సైజులో ఉన్న రబ్బరు మొసళ్లను పట్టుకుని ఫ్యాన్స్ థియేటర్‌లో హంగామా చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన వారంతా క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ మరీ ఇంత వైల్డ్‌గా ఉన్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు

కాగా ‘ది రాజా సాబ్’ సినిమాలో ప్రభాస్ మొసలితో ఫైట్ చేసే సన్నివేశం ఉంది. రీసెంట్‌గా వచ్చిన ట్రైలర్‌లో కూడా ఈ సన్నివేశాన్ని చూపించారు. ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ కూడా అదే తరహాలో ఆలోచన చేశారు. ది రాజాసాబ్ ఆడుతున్న సినిమా థియేటర్‌లోకి ఏకంగా రబ్బరు మొసళ్లను పట్టుకుని వచ్చారు. డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్లు గా నటించారు. అలాగే బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, బొమన్ ఇరానీలు, జరీనా వాహబ్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.  పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను గ్రాండ్‌గా నిర్మించారు. థమన్ ఈ సినిమాకు స్వరాలు అందించారు. ప్రస్తుతం అభిమానుల సందడి చూస్తుంటే మొదటి రోజే ఈ సినిమా రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

ది రాజాసాబ్ థియేటర్ లో మొసళ్లతో హంగామా చేస్తోన్న ప్రభాస్ అభిమానులు.. వీడియో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.