‘బాహుబలి’ ప్రభాస్…తెలుగు సినిమా చరిత్రలో ఈ పేరుకు సెపరేట్ హిస్టరీ ఉంది. మన దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో ప్రభాస్ కు అభిమానులు ఉన్నారు. కేవలం సినిమాల పరంగానే కాదు, ప్రభాస్ ప్రవర్తన, మనసు కూడా అభిమానుల సంఖ్యను పెంచింది. తాజాగా ఈ డార్లింగ్ హీరో అరుదైన రికార్డు అందుకున్నారు. ఫేస్బుక్లో 20 మిలియన్ల ఫాలోవర్స్ మార్క్‌ను అందుకున్న తొలి సౌత్ హీరోగా ఘనత సాధించారు.
ప్రస్తుతం ‘రాధేశ్యామ్’లో నటిస్తున్న డార్లింగ్.. ఆ తర్వాత దర్శకుడు నాగ్ అశ్విన్‌తో కలిసి పనిచేయనున్నారు. వీటితో పాటే ‘ఆదిపురుష్’లోనూ రాముడిగా కనిపించనున్నారు. ఇవన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలే. ఈ మూడు భారీ ప్రాజెక్టులతో ప్రభాస్ ఖాతాలో మరిన్ని రికార్డులు జమవుతాయనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
Also Read :