ఇప్పుడు ఎక్కడ చూసిన కల్కి 2898 ఏడీ పేరు మారుమోగుతుంది. ఎప్పటినుంచో ఆసక్తిగా వెయిట్ చేస్తున్న భారీ బడ్జెట్ మూవీ అడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ సినిమా కోసం తెలుగు రాష్ట్రాలతోపాటు దేశమంతా ఎదురుచూస్తుంది. డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ఇప్పటికే ఓ రేంజ్ అంచనాలు ఉన్నాయి. జూన్ 27న ఈ సినిమా విడుదల కానుంది. ఈ క్రమంలోనే సరికొత్తగా కల్కి ప్రమోషన్స్ చేస్తుంది చిత్రయూనిట్. ప్రేక్షకులకు దగ్గరయ్యేందుకు ఎప్పటికప్పుడు డిఫరెంట్ కాన్సెప్ట్ ప్రమోషన్స్ నిర్వహిస్తున్నాడు డెరెక్టర్ నాగ్ అశ్విన్. ఇక ఇందులో ప్రభాస్ నడిపే వెహికల్ బుజ్జిని ఇటీవల గ్రాండ్ గా ఈవెంట్ ఏర్పాటు చేసి అభిమానుల ముందు లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీతో కలిసి కల్కి మూవీ టీమ్ ఈ బుజ్జి వెహికల్ తయారు చేసిన సంగతి తెలిసిందే. కొత్తగా కనిపిస్తున్న ఈ కారును చూసి ఆశ్చర్యపోతున్నారు. హైటెక్ రోబాకార్ అయిన బుజ్జిని అద్భుతమైన డిజైన్ తో రెడీ చేయగా.. నెటిజన్స్ దృష్టిని ఆకర్షిస్తుంది.
ఇక ఈ సినిమాలో బుజ్జి కారు కోసం హీరోయిన్ కీర్తి సురేష్ వాయిస్ ఓవర్ అందించారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ విడులకు ఇంకా కొన్ని వారాలు మాత్రమే మిగిలి ఉంది. దీంతో ఇప్పుడు ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది చిత్రూయనిట్. కల్కి కోసం నటీనటులు కాకుండా బుజ్జి కారుతో దేశమంతా ప్రమోషన్స్ చేయడం గమనార్హం. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బుజ్జి కారును తిప్పుతూ ప్రమోషన్స్ చేస్తున్నారు. ప్రస్తుతం బుజ్జి కారు చెన్నై రోడ్లపై సందడి చేస్తుంది. చెన్నై రోడ్లపై ప్రభాస్ బుజ్జి వెహికల్ తిరుగుతుండగా.. అక్కడున్న జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోస్ నెట్టింట వైరలవుతున్నాయి.
#Bujji arrived on the streets of CHENNAI. @BelikeBujji will travel all over India for the promotion of #Kalki2898AD starts from Chennai ( South to north ) .
#Prabhas @nagashwin7 . pic.twitter.com/g1DTHMNLPR— Prabhas Trends (@TrendsPrabhas) May 28, 2024
ఇదిలా ఉంటే.. చెన్నై రోడ్లపై బుజ్జి కారు సందడి చేస్తున్న వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోకు డైరెక్టర్ నాగ్ అశ్విన్ రియాక్ట్ అవుతూ.. ఎలాన్ మస్క్ ను ట్యాగ్ చేశాడు. “ప్రియమైన ఎలన్ మస్క్ సర్. మా బుజ్జిని చూడటానికి నడపడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. ఇది 6 టన్నుల బరువున్న ఒక వాహనం. ఫుల్ ఎలక్ట్రిక్ వెహికల్. ఇదొక ఇంజనీరింగ్ అద్భుతం. ఇది మీకు ఒక గొప్ప అనుభూతి ఇస్తుందని చెప్పగలను” అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం డైరెక్టర్ నాగ్ అశ్విన్ ట్వీట్ నెట్టింట వైరలవుతుంది.
Dear @elonmusk sir… We would love to invite you to see and drive our #Bujji… it’s a 6 ton beast, fully #madeinindia Fully Electric & an engineering feat.. And I daresay it’ll make for a great photo-op with ur cybertruck 😬 (would be a sight to see them drive together)
— Nag Ashwin (@nagashwin7) May 28, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.