పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫుల్ జోష్ మీదున్నాడు. వరుసగా సినిమాలను లైన్లో పెట్టెస్తూ.. మోస్ట్ వాంటెడ్ హీరోగా మారిపోయాడు రెబల్ స్టార్. ఇప్పటికే ప్రభాస్, పూజా హెగ్డె హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘రాధేశ్యామ్’ జూలై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉండగా.. ప్రభాస్ ప్రస్తుతం మరో రెండు సినిమాల షూటింగ్లలో పాల్గొంటున్నాడు. కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ‘సలర్’ సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నాడు. ఈ సినిమాతోపాటే బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ డైరెక్షన్లో ఆదిపురుష్ మూవీ చేయనున్నాడు. తాజాగా సోషల్ మీడియాలో ప్రభాస్ న్యూలుక్ తెగ వైరల్ అవుతుంది.
ప్రభాస్, ఓంరౌత్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘ఆదిపురుష్’ సినిమా ఇటీవలే ముంబైలో ప్రారంభమయ్యింది. ఇందులో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నాడు. తాజాగా ముంబైలో వేసిన సెట్లో ఓ అభిమానితో కలిసి ఫోటోకు ఫోజులిచ్చాడు ప్రభాస్. ఇంకేముందు ఆ ఫోటో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ ఇదే లుక్లో కనిపించనున్నట్లుగా ప్రచారం జరుగుతంది. దీంతో ట్విట్టర్లో #Adipurush అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. దీంతో ఆదిపురుష్ సినిమా నుంచి ప్రభాస్ న్యూలుక్ ఎప్పుడు రివీల్ చేస్తారా అని ఎదురు చూస్తున్నారు అభిమానులు. రూ.400 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ రావణుడి పాత్రలో కనిపించనున్నాడు.
#Prabhas As Lord Rama in #Adipurush ? pic.twitter.com/0avJZT28pN
— Nikhil Prabhas ™ (@Rebelismm) February 21, 2021
Also Read: