రీజనల్ టూ.. పాన్ ఇండియన్ రేంజ్ కు ఎదిగిన రెబల్ స్టార్ ప్రభాస్.. ఏ హీరోకు సాధ్యం కాని రేంజ్లో.. పరిగెడుతున్నారు. ఓ పక్క పాన్ ఇండియన్ సినిమాలు మాత్రమే సైన్ చేస్తూ.. మరో పక్క ఆ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్‌లతో.. అందర్నీ షాకయ్యేలా చేస్తున్నారు. తెలుగు గడ్డపై ఏకంగా నెంబర్ 1 ప్రీ రిలీజ్ బిజినెస్ హీరోగా అవతరించేశారు మన ప్రభాస్. ఇప్పటికే ఆదిపురుష్ సినిమాతో అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్నారు డార్లింగ్. ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఆదిపురుష్ సినిమా పై అంచనాలు ఇప్పటికే ఆకాశాన్ని తాకే రేంజ్ లో ఉన్నాయి. రాముడిగా ప్రభాస్ ను చూసేందుకు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఇక ఈ సినిమాలో సీతగా బాలీవుడ్ బ్యూటీ కృతిసనన్ నటిస్తోంది.
ఇప్పటికే ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ భారీగా జరుగుతోంది. సెలబ్రెటీలు కూడా ఆదిపురుష్ మూవీ టికెట్స్ వేలల్లో కొంటున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో చిత్రయూనిట్ బిజీ బిజీగా ఉంది. జూన్ 16న భారీ స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా ఆదిపురుష్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా ఓటీటీ రైట్స్ కూడా భారీ ధరకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది.
ఆదిపురుష్ సినిమా ఓటీటీ రైట్స్ కోసం బడా సంస్థలు పోటీపడ్డాయని తెలుస్తోంది. అయితే అత్యంత ధరకు అమెజాన్ ప్రైమ్ వీడియో ఆదిపురుష్ డిజిటల్ రైట్స్ ను కొనుగోలు చేసిందట. ఇక సినిమా విడుదలైన ఎనిమిది వారల తర్వాత ఓటీటీలో రిలీజ్ కానుంది ఆదిపురుష్. ఇందుకు సంబంధించిన వార్తలు ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.