
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాతో ప్రభాస్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ సృష్టించిన ప్రభంజనం గురించి చెప్పక్కర్లేదు. దీంతో నార్త్ ఇండస్ట్రీలోకి డార్లింగ్‌కు ఫాలోయింగ్ మరింత పెరిగింది. ఆ తర్వాత ప్రభాస్ నటించే సినిమాల కోసం సౌత్ టూ నార్త్ అడియన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. నటనపరంగా ప్రభాస్ మెప్పించినా.. కంటెంట్.. డైరెక్టర్ మేకింగ్స్ పై అనేక విమర్శలు వచ్చాయి. ఇక ఇప్పుడు డార్లింగ్ నటిస్తోన్న సలార్ సినిమా పైనే యంగ్ రెబల్ ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. కేజీఎఫ్ సినిమాలను నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ ఈ మూవీని నిర్మిస్తుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ మూవీపై హైప్ క్రియేట్ చేయగా.. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై మరింత క్యూరియాసిటిని కలిగించాయి.
ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని.. ప్రమోషన్లలో బిజీగా ఉంది చిత్రయూనిట్. డైరెక్టర్ ప్రశాంత్ నీల్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, మలయాళీ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. డిసెంబర్ 22న క్రిస్మస్ సందర్భంగా ఈ మూవీ విడుదలవుతుండడంతో ప్రమోషన్స్ వేగవంతం చేశారు మేకర్స్. మరోవైపు దేశవ్యాప్తంగా సలార్ సంబరాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముంబైలో ప్రభాస్ పై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు ఫ్యాన్స్. నగరంలోని హార్ట్ ల్యాండ్ లో దాదాపు 120 అడుగుల ప్రభాస్ భారీ కటౌట్ ఏర్పాటు చేసి తమ ప్రేమను తెలిపారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అతిపెద్ద కటౌట్ ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. ఇంతకు ముందు కేజీఎఫ్ 2 సినిమా విడుదల సమయంలో 100 అడుగుల యష్ కటౌట్ ఏర్పాటు చేశారు. కానీ ఇప్పుడు ప్రభాస్ కోసం 120 కటౌట్ ఏర్పాటు చేసి రికార్డ్ క్రియేట్ చేశారు.
120 feet cutout in Mumbai. 🔥 🔥 🔥#Prabhas #Salaar pic.twitter.com/sJnrCfeBFh
— Prabhas Trends (@TrendsPrabhas) December 17, 2023
మాస్ యాక్షన్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా ఇప్పటికే సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. మొత్తం 2 గంటల 55 నిమిషాల నిడివి ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ A సర్టిఫికేట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో జగపతి బాబు, శ్రుతి హాసన్ కీలకపాత్రలు పోషిస్తుండగా.. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.
1st Pic: Eluru 🔥
2nd Pic Bhimavaram Natraj Theatre 💥Never Before Celebrations Loading In Telugu States 🥵
Every Place Lo CutOut padtadi Issa Fix 🤙🔥#Prabhas #Salaar 🦖👑 pic.twitter.com/I4SHxCnJJ4
— SATHISH BILLA 2.0 😈 (@Chill_Sattix_) December 17, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.