ప్రజంట్ ఓటీటీ ట్రెండ్ నడుస్తోంది. కరోనా దెబ్బకు సినిమా ఇండస్ట్రీ అంతా దెబ్బతింది. దీంతో నటీనటులు దర్శకులు ఓటీటీలవైపు చూస్తున్నారు. ఈ క్రమంలో టాలెంటెడ్ నటి సాయి పల్లవి కూడా త్వరలో ఓ వెబ్ సీరిస్ లో నటించబోతున్నట్లు సమాచారం. అది కూడా జాతీయ నటుడు ప్రకాశ్ రాజ్ తనయ పాత్రలో. పరువు హత్య నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఈ వెబ్ సీరీస్ నిర్మించనుందట. తన పాత్రకు ప్రాధాన్యం ఉండటంతో మరో ఆలోచన లేకుండా సాయి పల్లవి ఈ ప్రాజెక్టుకు ఓకే చెప్పిందట. దీన్ని ప్రముఖ తమిళ దర్శకుడు వెట్రిమారన్ తెరకెక్కించనున్నట్లు సమాచారం.
కాగా ప్రస్తుతం సెన్సిటివ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా విడుదల కరోనా కారణంగా ఆగిపోయింది. పరిస్థితులు చక్కదిద్దుకున్నాక రిలీజ్ చెయ్యాలని యూనిట్ భావిస్తోంది.