Pooja Hegde: రజనీకాంత్ సినిమాలో స్పెషల్ సాంగ్.. ‘జిగేలు’మనేలా పూజా రెమ్యునరేషన్ .. ఎన్నికోట్లంటే?

ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో నంబర్ 1 హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది పూజా హెగ్డే. అయితే కాలం గిర్రున తిరిగింది. ఇప్పుడు ఈ అమ్మడికి టాలీవుడ్ లో ఒక్క అవకాశం కూడా రావడం లేదు. హీరోయిన్ గా ఓ వెలిగిపోయిన పూజా హెగ్డే ఇప్పుడు రజనీకాంత్ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేస్తోంది.

Pooja Hegde: రజనీకాంత్ సినిమాలో స్పెషల్ సాంగ్.. జిగేలుమనేలా పూజా రెమ్యునరేషన్ .. ఎన్నికోట్లంటే?
Pooja Hegde

Updated on: Mar 02, 2025 | 9:55 AM

గతంలో తమిళం, తెలుగు భాషల్లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది పూజా హెగ్డే. అయితే క్రమంగా అవకాశాలు తగ్గిపోవడంతో బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వెళ్లింది. అయితే అక్కడ కూడా ఈ ముద్దుగుమ్మకు వరుస పరాజయాలే పలకరించాయి. ఈ నేపథ్యంలో ఈ బుట్టబొమ్మ రజనీకాంత్ నటించిన ‘కూలీ’ చిత్రంలో ఒక ప్రత్యేక గీతం చేయడానికి అంగీకరించింది. అయితే ఈ స్పెషల్ సాంగ్ కోసం పూజ చాలా పెద్ద మొత్తంలో పారితోషికం అందుకుంటోందని తెలుస్తోంది. లోకేష్ కనగరాజ్ ‘కూలీ’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ‘జైలర్’ సినిమాలో రజనీకాంత్, తమన్నా నటించిన ప్రత్యేక గీతం సూపర్ హిట్ అయింది. ఈ కారణంగానే కొత్త సినిమాలో కూడా ఒక స్పెషల్ సాంగ్ చేర్చారని చెబుతున్నారు. ఇందుకోసం లోకేష్ కనగరాజ్ పూజా హెగ్డే ను తీసుకున్నారని చెబుతున్నారు.

కాగా రజనీకాంత్ తో నటించడానికి పూజా హెగ్డే రెండు కోట్ల రూపాయల పారితోషికం అడిగిందని సమాచారం. నిర్మాతలు కూడా అంత మొత్తంలో అందించడానికి అంగీకరించారట. తమన్నా, రజనీకాంత్ నటించిన పాట సూపర్ హిట్ అయింది. ఇప్పుడు పూజా హెగ్డే నటించిన పాట కూడా హిట్ అయ్యే అవకాశం ఉందని నిర్మాతలు అంచనా వేస్తున్నారు. అందువల్ల, వారు పూజ అడిగిన పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించడానికి అంగీకరించారట.

ఇవి కూడా చదవండి

రెండు కోట్లకు పైగానే..

‘కూలీ’ సినిమాలో నటీనటుల జాబితాను పరిశీలిస్తే, ఇందులో పెద్ద తారాగణమే ఉంది. నాగార్జున, ఉపేంద్ర, శ్రుతి హాసన్, సత్యరాజ్, సౌబిన్ షాహిర్ తదితరులు ఈ సినిమాలో ఉన్నారు. అన్ని భాషల కళాకారులు ఇందులో నటించడం విశేషం. ఈ సినిమా షూటింగ్ చివరి దశ పనులు జరుగుతున్నాయి. సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. ‘కూలీ’ సినిమా తర్వాత రజనీకాంత్ ‘జైలర్ 2’ పనుల్లో బిజీగా ఉంటారు. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక పూజా హెగ్డే విజయ్ జయనాయగన్, సూర్య రెట్రో సినిమాల్లో నటిస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.