నచ్చితే గుండెలకు హత్తుకుంటారు.. ఎత్తి నెత్తిన పెట్టుకుంటారు.. నచ్చకపోతే నిర్దాక్షిణ్యంగా నేలకేసి కొట్టేస్తారు… కోలీవుడ్ ఆడియన్స్‌కి ఇది ఎప్పుడూ వుండే అలవాటే. ఈ కల్ట్ లవ్‌తో పేట్రేగిపోతున్న ఫ్యాన్స్‌తో పెద్ద తంటానే వచ్చిపడిందిప్పుడు. ఫలితం… అటువైపు చూడాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు సినీ సెలబ్స్. ఇన్ స్టాగ్రామ్ ఫాలోయర్లలో 13 మిలియన్ల మార్క్ క్రాస్ చేసి.. సంబరంలో వున్న పూజా హెగ్డేకు.. కోలీవుడ్‌లో ఓ వైరల్ న్యూస్ షాకిచ్చేసింది. ఇండస్ట్రీలో తన కొలీగ్‌లా కంటిన్యూ అవుతున్న రష్మిక గుండు ఫోటో కోలీ సర్కిల్స్‌లో హల్‌చల్ చేస్తోందట. కార్తీతో చేసిన సుల్తాన్ మూవీ ఫల్టీ కొట్టడానికి రష్మికే కారణమని భావిస్తూ… ఆమె ఫోటోకు గుండుకొట్టి ఇలా డీఫేమ్ చేస్తున్నారట. ఇంతకీ రష్మిక గుండుకీ… బుట్టబొమ్మ భయానికీ సంబంధం ఏంటి?
హీరోలైనా.. హీరోయిన్లనైనా.. అంతే ఇదిగా ప్రేమిస్తారక్కడ. ఇష్టపడితే గుండెల్లో చోటివ్వడమే కాదు.. చందాలేసుకుని గుడి కట్టించేంత గాఢంగా అభిమానిస్తారు తమిళ ఫ్యాన్స్. రష్మిక విషయంలో కూడా ఆ డైహార్డ్‌నెస్సే దెబ్బతీసింది. రేపటిరోజున కోలీవుడ్ దళపతి విజయ్ పక్కన హీరోయిన్‌గా చేస్తున్నారు పూజ. 18 ఏళ్ల గ్యాప్ తర్వాత తమిళ్ మూవీ చేస్తూ.. ఆక్కడి ఆడియన్స్‌కి హాయ్ చెబ్తున్నారీ గోపికమ్మ.
గతంలో నయన్, కీర్తి సురేశ్‌తో పాటు మరికొంతమంది హీరోయిన్లక్కూడా ఇలాగే సోషల్‌మీడియాలో గుండు గీసి.. ఫొటోలు వైరల్ చేశారు. ఫ్యూచర్‌లో తన సినిమాలు కూడా ఏమాత్రం అడ్డం తిరిగినా.. ఇదే ట్రీట్‌మెంట్ ఇస్తారా అనేది పూజమ్మ బెంగ. కష్టకాలంలో మంచిమంచి సినిమాలిచ్చి ఆదుకున్న టాలీవుడ్‌తో పూజాకు మంచి కనెక్టివిటీ వుంది. ప్రస్తుతం తెలుగులో రాధేశ్యామ్, ఆచార్య, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వున్నాయి పూజా ఖాతాలో. ఇప్పుడు తమిళ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్న టైమ్‌లో.. అక్కడి నెటిజన్లతో బ్యాలెన్స్‌డ్‌గా ఎలా వుండాలో స్పెషల్‌గా నేర్చుకుంటున్నారట పూజాహెగ్డే.
మరిన్ని ఇక్కడ చదవండి :