డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియిన్ సెల్వన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. సెప్టెంబర్ 30న విడుదలైన ఈ సినిమాకు అన్ని వర్గాల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి. భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ మూవీలో ఐశ్వర్య రాయ్, త్రిష, జయం రవి, కార్తి, చియాన్ విక్రమ్ ప్రధాన పాత్రలు పోషించారు. చోళ రాజుల కాలంలో జరిగిన సంఘటనలను ఈ చిత్రంలో చూపించారు డైరెక్టర్ మణి. గత తొమ్మిది రోజులుగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీగా వసూళ్లు రాబడుతూ.. రూ. 350 కోట్ల మార్క్‌కు చేరువయ్యింది. ఇక ఈ వీకెండ్ లో ఈ చిత్రం ఈ మార్కును కూడా అధిగమించే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు మేకర్స్. పీరియాడికల్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా దేశవ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లో కూడా మంచి వసూళ్లు సాధిస్తుంది.
ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ వారాంతం నాటికి పొన్నియన్ సెల్వన్ ప్రపంచవ్యాప్తంగా రూ.350 కోట్లు దాటే అవకాశం ఉంది. బాక్సాఫీస్ వద్ద పెద్దగా పోటీ లేకపోవడంతో దీపావళి వరకు ఈ సినిమా మంచి బిజినెస్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రముఖ రచయిత కల్కి కృష్ణమూర్తి రాసిన పొన్నియిన్ సెల్వన్ నవల ఆధారంగా ఈ మూవీని నిర్మించారు మణి. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.
తమిళంలో ఈసినిమాకు ఊహించని రీతిలో రెస్పాన్స్ వస్తుంది. విక్రమ్, కోబ్రా మూవీ తర్వాత భారీ విజయాన్ని సాధించిన చిత్రంగా నిలిచింది పొన్నియిన్ సెల్వన్. ఈ సినిమాను పూర్తిగా రెండు భాగాలుగా తీసుకువస్తున్నారు డైరెక్టర్ మణిరత్నం. త్వరలోనే సెకండ్ పార్ట్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.
#PS1 USA ??
Huge Saturday loading..
By 10 AM PST, $200K done..
$400K+ possible
— Ramesh Bala (@rameshlaus) October 8, 2022
#PS1 has crossed 25,000 admissions in France ??
— Ramesh Bala (@rameshlaus) October 8, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.