Ponniyin Selvan2: షాకిస్తున్న మణిరత్నం పొన్నియన్ సెల్వన్ 2 రన్‌ టైం..

|

Apr 17, 2023 | 9:23 AM

ఏప్రిల్ 28న రిలీజయ్యే పార్ట్‌ 2 కోసం అందర్నీ విపరీతంగా వెయిట్ చేసేలా చేసింది. ఇక ఈ క్రమంలోనే ఈ మూవీ సెన్సార్ షిప్ పూర్తై.. రన్ టైం లాక్‌ అయిందనే అప్డేట్ ఇప్పుడు అందర్లో.. ఈ సినిమాపై ఓ తెలియని ఈగర్‌ను పెంచేస్తోంది.

Ponniyin Selvan2: షాకిస్తున్న మణిరత్నం పొన్నియన్ సెల్వన్ 2 రన్‌ టైం..
Ponniyin Selvan
Follow us on

మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన పొన్నియన్ సెల్వమ్‌ పార్ట్ 1 సూపర్ డూపర్ హిట్టైంది. ఏప్రిల్ 28న రిలీజయ్యే పార్ట్‌ 2 కోసం అందర్నీ విపరీతంగా వెయిట్ చేసేలా చేసింది. ఇక ఈ క్రమంలోనే ఈ మూవీ సెన్సార్ షిప్ పూర్తై.. రన్ టైం లాక్‌ అయిందనే అప్డేట్ ఇప్పుడు అందర్లో.. ఈ సినిమాపై ఓ తెలియని ఈగర్‌ను పెంచేస్తోంది.

ప్రోమోతో.. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్‌తో.. త్రూ అవుట్ ఇండియా విపరీతమైన అంచనాలు పెంచేసుకున్న పీఎస్ 2 తాజాగా సెన్సార్‌ పూర్తి చేసుకుందట. రీసెంట్‌గా.. ఈ సినిమాను చూసిన సెన్సార్ జ్యూరీ ఈ సినిమాకు యూబై ఎ సర్టిఫికేట్ ను మంజూరు చేసిందట. కొన్ని కట్స్ మినహా అంతా ఓకే చెప్పిందట. ఇక ఇదే విషయాన్ని ఈ మూవీ మేకర్స్ కన్ఫర్మ్‌ చేశారు కూడా..!

ఇక దీంతో పాటు.. ఈ మూవీ రన్‌ టైం పై ఓ కూడా క్లారిటీ వచ్చేసినట్టు తెలుస్తోంది. మొదటి సినిమాలాగే.. ఈ మూవీ రన్ టైం రెండు గంటల.. 44 నిమిషాలతో.. కాస్త లెంతీగా ఉండడం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్‌ గా మారుతోంది. దాదాపు రెండున్నర గంటల విజువల్ వండర్ అనే కామెంట్ నెట్టింట వచ్చేలా చేసుకుంటోంది.