Tollywood: అమ్మ బాబోయ్… సినిమాలో అలా.. బయట ఇలా.. ఈ నటిని గుర్తుపట్టారా..?

|

Aug 22, 2024 | 6:16 PM

సత్యం రాజేష్ హీరోగా వచ్చిన ' మా ఊరి పొలిమేర ', ' పొలిమేర 2' సూపర్ సక్సెస్ అందుకున్నాయి. మూవీలో గెటప్ శీను భార్యగా నటించిన యంగ్ బ్యూటీ సాహితీ దాసరి అదిరిపోయే రేంజ్లో పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ప్రజంట్ ఈ నటికి మంచి అవకాశాలు వస్తున్నాయి.

Tollywood: అమ్మ బాబోయ్... సినిమాలో అలా.. బయట ఇలా.. ఈ నటిని గుర్తుపట్టారా..?
Sahiti Dasari
Follow us on

ఒకప్పుడు అంటే సినిమాలు చూడాలంటే థియేటర్లకు వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఓటీటీలు వచ్చేశాయ్.. వరల్డ్ సినిమా అంతా మన ఇంట్లోకి వచ్చేసింది. ఎవరికి నచ్చిన జోనర్‌ని బట్టి వారు సినిమాలు చూసేయొచ్చు. కొత్త కొత్త వెబ్ సిరీస్‌లతో, సూపర్ కథలతో వీక్షకులను మెప్పిస్తున్నారు మేకర్స్. అయితే హర్రర్, థ్రిల్లర్ సినిమాలకు ఆదరణ ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది. అప్పట్లో హాట్ స్టార్ ఓటీటీలో వచ్చిన మా ఊరి పొలిమేర సినిమా మంచి హిట్ అయింది. అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది.

సత్యం రాజేష్ మెయిన్ లీడ్ చేయగా… కామాక్షి భాస్కర్ల, బాలాదిత్య గెటప్ శ్రీను  కీ రోల్స్ పోషించారు. ఆచార్య క్రియేషన్స్ బ్యానర్‌పై భోగేంద్ర గుప్త ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమాను డాక్టర్‌ అనిల్ విశ్వనాథ్‌ డైరెక్ట్ చేశారు. బ్లాక్ బాస్టర్ హిట్ అవడంతో.. ఈ సినిమాకు సీక్వెల్ రూపొందించి..   థియేటర్స్‌లో రిలీజ్ చేశారు. మా ఊరిపొలిమేర-2 కూడా మంచి రెస్పాన్స్ అందుకుంది. సినిమాలో ఉండే ట్విస్ట్‌లు ఆడియెన్స్‌ను బాగా రంజింపచేశాయి. ఈ చిత్రంలో రాజేష్ భార్యగా నటించిన కామాక్షికి మంచి నేమ్ అండ్ ఫేమ్ దక్కాయి.. గెటప్ శ్రీను భార్యగా నటించిన సాహితీ దాసరికి కూడా మంచి గుర్తింపు అభించింది. రాములు పాత్రలో ఆమె చక్కగా ఒదిగిపోయారు. గెటప్ శ్రీను అర్ధాంగిగా.. రాజేష్‌పై మనసు పడ్డ మరదలిగా చక్కగా నటించారు. రాములు ఫ్లాష్ బ్యాక్ తెలిశాక.. స్టోరీ మంచి సస్పెన్స్‌తో సాగుతుంది.

తొలుత సోషల్ మీడియాలో క్రేజ్ తెచ్చుకున్న సాహితికి..ఆ తర్వాత మూవీస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. మా ఊరి పొలిమేర సినిమా తర్వాత.. ఆమెకు టాలీవుడ్‌లో మంచి అవకాశాలే వస్తున్నాయి. సింగర్ సునీత కుమారుడు హీరోగా నటించిన ‘సర్కారు నౌకరి’ సినిమాలోనూ సాహితి కనిపించింది. ఇప్పుడు కంచు కనకమాలక్ష్మి అనే మూవీలో నటించింది. మా ఊరి పొలిమేర మూవీలో పల్లెటూరి గృహిణిగా కనిపించిన సాహితీ.. బయట మాత్రం చాలా పాష్. ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పిక్స్ తెగ ట్రెండ్ అవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.