
లెజెండ్ శరవణన్.. 50పదుల వయసులో హీరో అవ్వాలన్న కోరికను నెరవేర్చుకున్నాడు. ప్రముఖ వ్యాపారవేత్త అయిన శరవణన్ హీరోగా మారి సినిమా చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు. వస్త్ర వ్యాపారం శరవణన్ స్టోర్స్ అధినేత అయిన ఈ శరవణన్. తన బ్రాండ్స్‌కు తానే మోడల్ గా మారి యాడ్స్ చేస్తూ పాపులర్ అయ్యాడు. స్టార్ హీరోయిన్స్ తో కలిసి యాడ్స్ చేసి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఆ సమయంలో ట్రోల్స్ బారిన కూడా పడ్డాడు. ఎన్ని ట్రోల్స్ వచ్చినా కూడా ఆయన మాత్రం వెనకడుగు వేయలేదు. లెజెండ్ అనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ తో తెరకెక్కించాడు. దాదాపు 60 కోట్ల బడ్జెట్‌తో పాన్ ఇండియన్ లెవల్లో లెజెండ్ సినిమాను తెరకెక్కించాడు శరవణన్.
ఇక ఇప్పుడు కొంత గ్యాప్ తీసుకొని మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.. ఈ సినిమా కోసం శరవణన్ సరికొత్త లుక్ లో కనిపించనున్నాడు. చాలా రోజులగా ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమాను యాక్షన్ రొమాంటిక్ కథతో చేయనున్నాడని తెలుస్తోంది. ఈ సినిమా కోసం భారీ తరగణాన్ని తీసుకోనున్నారట. హీరోయిన్ గా ఓ బాలీవుడ్ టాప్ బ్యూటీని ఎంపిక చేశారని తెలుస్తుంది.
అలాగే టాలీవుడ్ బ్యూటీ కూడా ఈ సినిమాలో నటిస్తుంది. ఆమె ఎవరో కాదు హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న పాయల్ రాజ్ పుత్. ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు శరవణన్ తో రొమాన్స్ చేయనుందని తెలుస్తుంది. ఆర్ఎక్స్ 100సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది పాయల్. ఆ సినిమాలో రొమాంటిక్స్ సీన్స్ లో రెచ్చిపోయి నటించి మెప్పించింది. తన అందంతో కుర్రాళ్లను కవ్వించింది. ఆతర్వాత ఈ బ్యూటీకి ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. చివరిగా మంగళవారం సినిమాతో హిట్ అందుకుంది. ఇక ఇప్పుడు ఈ అమ్మడు శరవణన్ తో రొమాన్స్ కు రెడీ అయ్యింది. సోషల్ మీడియాలో ఈ భామ తన అందాలతో కవ్విస్తుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.