పాయల్..అతడు ప్రియుడని చెప్పి మా హృదయాలు గాయపర్చకు!

|

Jul 23, 2019 | 6:19 PM

హైదరాబాద్‌: ‘ఆర్‌ఎక్స్‌ 100’ సినిమాలో హాట్..హాట్ అందాలతో కుర్రకారు గుండెల్లో సెగలు రేపింది హీరోయిన్ పాయల్‌ రాజ్‌పుత్‌. ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్ ఇప్పుడు హ్యూజ్ ఫాలోయింగ్ ఏర్పడింది. అమ్మడికి సంబంధించి ఏ అబ్డేట్ అయినా తెలుసుకోడానికి యూత్ తెగ ఇంట్రస్ట్ చూయిస్తున్నారు. అయిత్ పాయల్ ప్రేమలో పడ్డారా?పై ఫొటోలో ఆమె పక్కన కూర్చున్న వ్యక్తి ఎవరు? ఆమె లవరా? ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఫొటో చూసి నెటిజన్లు వేస్తున్న ప్రశ్నలు ఇవి. సోమవారం రాత్రి ఇన్‌స్టాగ్రామ్‌లో పాయల్‌ ఓ […]

పాయల్..అతడు ప్రియుడని చెప్పి మా హృదయాలు గాయపర్చకు!
Follow us on

హైదరాబాద్‌: ‘ఆర్‌ఎక్స్‌ 100’ సినిమాలో హాట్..హాట్ అందాలతో కుర్రకారు గుండెల్లో సెగలు రేపింది హీరోయిన్ పాయల్‌ రాజ్‌పుత్‌. ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్ ఇప్పుడు హ్యూజ్ ఫాలోయింగ్ ఏర్పడింది. అమ్మడికి సంబంధించి ఏ అబ్డేట్ అయినా తెలుసుకోడానికి యూత్ తెగ ఇంట్రస్ట్ చూయిస్తున్నారు. అయిత్ పాయల్ ప్రేమలో పడ్డారా?పై ఫొటోలో ఆమె పక్కన కూర్చున్న వ్యక్తి ఎవరు? ఆమె లవరా? ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఫొటో చూసి నెటిజన్లు వేస్తున్న ప్రశ్నలు ఇవి.

సోమవారం రాత్రి ఇన్‌స్టాగ్రామ్‌లో పాయల్‌ ఓ ఫొటోను పోస్ట్‌ చేశారు. అయితే ఎలాంటి క్యాప్షన్‌ ఇవ్వకుండా ఏదో కోడ్‌ భాషలా నాలుగు గీతలను యాడ్ చేశారు. దాంతో నెటిజన్లు ఆమె ప్రియుడై ఉంటాడంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రియుడి అని చెప్పి మా గుండెల్ని అప్పుడే గాయపర్చకు అంటూ ఆమెను ఆరాధించేవాళ్లు కామెంట్ చేస్తున్నారు.  అదీకాకుండా కామెంట్స్‌ ఎక్కువగా కనిపించకుండా పాయల్‌ కొన్ని బ్లాక్‌ చేసేశారు. ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి ఎవరో పాయల్‌ చెప్తే కానీ క్లారిటీ వచ్చేలా లేదు. ప్రస్తుతం ఆమె ‘వెంకీ మామ’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఇందులో ఆమె వెంకటేశ్‌కు జోడీగా నటిస్తున్నారు. దీంతో పాటు ‘ఆర్‌డీఎక్స్‌’, రవితేజకు జోడీగా ‘డిస్కో రాజా’ చిత్రాల్లో నటిస్తున్నారు.