Ustad Bhagat Singh: పవర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌ గెట్‌ రెడీ.. మరికొన్ని గంటల్లో ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ గ్లింప్స్‌

ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉన్న ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ నుంచి ఇవాళ (మే11) మరో క్రేజీ అప్డేట్‌ రానుంది. గురువారం సాయంత్రం 4:59 నిమిషాలకి పవన్‌ మూవీ గ్లింప్స్‌ రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించిన చిత్రబృందం మూవీకి సంబంధించిన కొత్త పోస్టర్‌ను కూడా రిలీజ్‌ చేసింది.

Ustad Bhagat Singh: పవర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌ గెట్‌ రెడీ.. మరికొన్ని గంటల్లో ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ గ్లింప్స్‌
Pawan Kalyan

Updated on: May 11, 2023 | 8:30 AM

సరిగ్గా పదకొండేళ్ల క్రితం ఇదే రోజు ( మే11, 2012) గబ్బర్‌ సింగ్‌ సినిమా విడుదలైంది. పవన్‌ కల్యాణ్‌- హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ మూవీ ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అప్పటివరకు వరుసగా ప్లాపులతో సతమతమవుతోన్న పవన్‌కు మంచి కమ్‌ బ్యాక్‌ ఇచ్చిందీ మూవీ. బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులు సృష్టించింది. ఇప్పుడు ‘అంతకు మించి’ అని ఉండేలా పవన్‌- హరీశ్‌ కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతుంది. ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో లెటెస్ట్‌ సెన్సేషన్‌ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే టైటిల్‌కు, పవన్‌ పోస్టర్‌కు అభిమానుల నుంచి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉన్న ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ నుంచి ఇవాళ (మే11) మరో క్రేజీ అప్డేట్‌ రానుంది. గురువారం సాయంత్రం 4:59 నిమిషాలకి పవన్‌ మూవీ గ్లింప్స్‌ రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించిన చిత్రబృందం మూవీకి సంబంధించిన కొత్త పోస్టర్‌ను కూడా రిలీజ్‌ చేసింది.

కాగా ఉస్తాద్‌ భగత్ సింగ్‌ మూవీ ఫస్ట్‌ గ్లింప్స్‌ను హైదరాబాద్‌లోని సంధ్య 70ఎమ్‌ఎమ్‌లో లాంచ్ చేయనున్నట్లు తెలిపింది చిత్రబృందం. హైదరాబాద్‌లో కేవలం ఈ ఒక్క థియేటర్‌లోనే పవన్‌ మూవీ గ్లింప్స్‌ స్క్రీనింగ్‌ కానుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఉస్తాద్ భగత్‌ సింగ్‌ సినిమాకి రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నాడు. మాస్ సినిమాలు బాగా తీస్తాడని పేరున్న హరీశ్‌ శంకర్‌ ఈ సారి పవన్‌ను ఎలా చూపిస్తాడోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించి క్యాస్టింగ్, ఇతర వివరాలు తెలియనున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..