పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. కొన్నాళ్లుగా రాజకీయాలతో బిజీగా ఉండడంతో పవన్ సినిమాలు ఆలస్యమవుతూ వచ్చాయి. కానీ ఇప్పుడు తన ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసే పనిలో పడ్డారు. కొన్నాళ్లుగా పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా హరి హర వీరమల్లు. ఈమూవీ కోసం చాలాకాలంగా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇప్పుడు ఎట్టకేలకు ఈ మూవీ అడియన్స్ ముందుకు రాబోతుంది. డైరెక్టర్ జ్యోతికృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. ఇందులో పవన్ జోడిగా నిధి అగర్వాల్ నటిస్తుంది. అలాగే బాలీవుడ్ యాక్టర్ బాబీ డియోల్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీ అప్డేట్స్ కోసం కొన్ని రోజులుగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ట్రైలర్ రిలీజ్ అప్డేట్ షేర్ చేసింది చిత్రయూనిట్.ఈ సినిమా ట్రైలర్ జూలై 3న ఉదయం 11.10 గంటలకు రిలీజ్ చేయనున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ ఈ ట్రైలర్ చూస్తున్న వీడియో షేర్ చేసింది. అందులో చివరలో పవన్ దర్శకుడిని అభినందించడం కనిపిస్తుంది. చాలా కష్టపడ్డావ్ అంటూ ఆత్మీయంగా హత్తుకున్నారు.