పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తోన్న చిత్రాల్లో బ్రో ఒకటి. తమిళంలో సూపర్ హిట్ అయిన వినోదయ సిత్తం చిత్రానికి రీమేక్‌గా వస్తోంది ఈ సినిమా. నటుడు సముధ్రఖని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. పవన్ తోపాటు.. సూప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ సైతం నటిస్తున్నారు. మొదటిసారి మామ, మేనల్లుడు కలిసి నటిస్తోన్న సినిమా కావడంతో బ్రో గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మెగా ఫ్యాన్స్. ఈ చిత్రానికి డైరెక్టర్ త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తుండగా.. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ఆడియన్స్ ముందుకు రానుంది. ఇక ఇటీవల విడుదలైన పోస్టర్స్ మాత్రం సినిమాపై మరింత ఇంట్రెస్ట్ పెంచాయనే చెప్పుకోవాలి. అయితే గత వారం రోజులుగా ఈ మూవీ టీజర్ గురించి నెట్టింట చర్చ జరుగుతుంది. ఈ క్రమంలోనే తాజాగా బ్రో టీజర్ రిలీజ్ డేట్ పై స్పష్టతనిచ్చారు మేకర్స్. జూన్ 29న సాయంత్రం 5.04 గంటలకు బ్రో టీజర్ రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేస్తూ కొత్త పోస్టర్ షేర్ చేసింది చిత్రయూనిట్.
ఇదిలా ఉంటే.. గత కొన్ని రోజులుగా పవన్ ఆంధ్రప్రదేశ్ లో వారాహి యాత్రలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. అయితే స్వల్ప అనారోగ్యం కారణంగా ఆయన భీమవరంలోని పార్టీ కార్యలయంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇదే సమయంలో బ్రో మూవీ టీజర్ డబ్బింగ్ సైతం కంప్లీట్ చేశారు. డైరెక్టర్ సముద్రఖని పవన్ వద్దకు వెళ్లి బ్రో టీజర్ డబ్బింగ్ పనులను పూర్తిచేయించుకున్నారు. ఓవైపు జ్వరంతో ఇబ్బందిపడుతున్నప్పటికీ టీజర్ కోసం డబ్బింగ్ చెప్పారు.
అయితే డబ్బింగ్ చెప్పిన సమయంలో పవన్ టీజర్ చూసి చిన్నపిల్లాడిలా నవ్వేసారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది. అయితే వీడియో చూసి నెటిజన్స్ విభిన్నంగా స్పందిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ మరోసారి దేవుడి పాత్రలో కనిపించనున్నారు. ఇందులో ప్రియా ప్రకాష్ వారియర్ కథానాయికగా నటించింది. ఈ సినిమా జూలై 28న బ్రో మూవీ రిలీజ్ కానుంది.
‘ @PawanKalyan had a crazy reaction while watching the #BroTheAvatar teaser
pic.twitter.com/JFKfiYrFn2— Supreme PawanKalyan FC™ (@SupremePSPK) June 28, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.