
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ‘బ్రో’ మేనియా నడుస్తోంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోలుగా నటిస్తోన్న ఈ మల్టీ స్టారర్ మూవీ జులై 28న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. దీంతో ప్రమోషన్లలో స్పీడ్ పెంచారు మూవీ మేకర్స్. ఇందులో భాగంగా మంగళవారం బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. ఇక పవన్ సినిమా రిలీజ్ అవుతుందంటే ఫ్యాన్స్‌కు పండగే. ఆయన సినిమా కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్రో ఫీవర్ ప్రారంభమైంది. ఈ క్రమంలో బ్రో మూవీ రిలీజ్‌ను పురస్కరించుకుని అమెరికాలోని డల్లాస్‌కు చెందిన పవన్ అభిమానులు ఒక వినూత్న కార్యక్రమం చేపట్టారు. టెస్లా కార్లను ‘బ్రో’ మూవీ టైటిల్ ఆకారంలో పార్కింగ్ చేసి లైట్ షో ఏర్పాటు చేశారు. అనంతరం డ్రోన్ ద్వారా దీనిని రికార్డు చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఆకాశం నుంచి చూస్తే టెస్లా కార్ల ‘బ్రో’ లైటింగ్ షో సూపర్బ్‌గా అనిపిస్తోంది. ఇది చూసి పవన్ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. ఇది కదా పవర్ స్టార్ రేంజ్ అంటూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.
కాగా తమిళ హిట్ మూవీ వినోదయ సీతంకు రీమేక్‌గా బ్రో తెరకెక్కింది. సముద్ర ఖని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో కేతిక శర్మ, ప్రియాంకా వారియర్ హీరోయిన్లుగా నటించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్‌ప్లే సమకూర్చారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ ఈ మల్టీస్టారర్ మూవీని నిర్మిస్తున్నారు. తమన్ అందించిన స్వరాలు, బీజీఎం ఇప్పటికే సెన్సేషన్ క్రియేట్ చేశాయి.
#BroTheAvatar Tesla Light Show @ Dallas, USA 💥🔥pic.twitter.com/to9FAGwOJS
— Trend PSPK (@TrendPSPK) July 24, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.