Pawan Kalyan Birthday: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకరకంగా పవన్ అంటే పడి చచ్చే ఫ్యాన్స్ ఉన్నారనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదేమో. అందుకునే ఓ పాటలో ‘పవన్ అంటే పడిచస్తారు’ అనే చరణాన్ని సైతం వాడేసుకున్నారు. ఇలా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న పవన్ పుట్టిన రోజున ఎలాంటి హంగామా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 2న పవన్ పుట్టిన రోజు వేడుకలను పెద్ద ఎత్తున జరుపుకున్నారు. సినీ ప్రముఖులతో పాటు అభిమానులు, జనసేన కార్యకర్తలు సందడి చేశారు.
ఇదిలా ఉంటే కొంత మంది డైహార్డ్ ఫ్యాన్స్ పవన్ పుట్టిన రోజు సందర్భంగా వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలోనే కడప నగరానికి చెందిన యువ ఇంజనీర్ నరసింహ శ్రీచరణ్ ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. శ్రీచరణ్‌కు రూబిక్స్‌తో వివిధ ఆకృతులు తయారు చేయడం హాబీ. ఈ అలవాటునే తన అభిమాన హీరోకు శుభాకాంక్షలు తెలియజేయడానికి ఉపయగించుకోవాలనుకున్న శ్రీచరణ్.. 550 రూబిక్ క్యూబ్స్‌తో పవన్ చిత్రాన్ని రూపొందించాడు. ఇందుకోసం ఈ కుర్రాడు ఏకంగా 24 గంటలపాటు కష్టపడడం విశేషం. దీనంతటికీ సంబంధించి వీడియోను చిత్రీకరించిన శ్రీచరణ్ ట్వీట్టర్‌లో పోస్ట్ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. మరి పవన్ ఫొటోను క్యూబ్స్‌తో ఎలా తయారు చేశారో మీరూ చూసేయండి.
Hpy B’day ? @PawanKalyan Anna??
Rubik’s Cube portrait 550 Cubes
Total time : 24+ hours
Art by : @SriCube #sricharanscubemosaics #sricharannarasimha #HappyBirthdayPSPK #HBDJanaSenaniPawanKalyan @PSPKFan2You @PSPKFanHere @TrendPSPK #AdvanceHBDJanaSenani @JanaSenaParty pic.twitter.com/QdfUN4xveO— Sri Charan’s Cube Mosaics (@SriCube) September 2, 2021
Also Read: MAA Elections: ‘మా’లో విందు రాజకీయాలు.. నెట్టింట వైరల్ అవుతోన్న నరేష్ పార్టీ ఆహ్వాన మెసేజ్.
Petrol Diesel Price: వాహనదారులకు ఊరట.. స్థిరంగా కొనసాగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు..!