
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు అదిరిపోయే సర్ ప్రైజ్ వచ్చేసింది. ఇటీవలే ఓజీ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న పవన్.. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన దేఖ్ లేంగే సాలా సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేస్తుంది. చాలా కాలం తర్వాత డ్యాన్స్ అదరగొట్టేశారు పవన్. డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో పవన్ జోడీగా శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తుండగా.. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న ఈ సినిమాపై మంచి హైప్ నెలకొంది.
ఇవి కూడా చదవండి : Tollywood : అలాంటి సీన్స్ చేయడానికి ఓకే.. కానీ లిప్ లాక్ అతడికి మాత్రమే.. టాలీవుడ్ హీరోయిన్..
ఈ సినిమా కోసం పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా శనివారం సాయంత్రం ఈ సినిమా నుంచి దేఖ్ లేంగే సాలా అనే పాటను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. దేవి శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ సాంగ్ నెక్స్ లెవల్లో ఉంది. అలాగే ఎంతో ఎనర్జిటిక్ గా ఉన్న ఈ పాటను సింగర్ విశాల్ డడ్లాని పాడగా.. భాస్కరభట్ల రాశారు.
ఇవి కూడా చదవండి : Megastar Chiranjeevi : చిరంజీవితో మూడు సినిమాల్లో ఛాన్స్.. ఆ కారణంతోనే చేయలేకపోయాను.. హీరోయిన్..
ఇందులో పవన్ కళ్యాణ్ డ్యాన్స్ స్టెప్పుల గురించి చెప్పక్కర్లేదు. చాలా కాలం తర్వాత వింటేజ్ పవన్ ను గుర్తుచేశారు. చిన్న చిన్న స్టెప్స్ అయినా.. ఎప్పటిలాగే తన స్వాగ్ తో అదరగొట్టేశారు. పవన్ పక్కన శ్రీలీల తన డ్యాన్స్ తో మ్యాజిక్ చేసింది. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేస్తుంది. విడుదలైన కొన్ని గంటల్లోనే ఈ పాటకు 16m వ్యూస్ వచ్చాయి. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు.
ఇవి కూడా చదవండి : Tollywood : అవకాశం ఇస్తానని ఇంటికొచ్చి మరీ అలా ప్రవర్తించాడు.. గుప్పెడంత మనసు సీరియల్ నటి..
ఇవి కూడా చదవండి : Actress Vahini : అప్పుడు సీరియల్స్‌తో క్రేజ్.. క్యాన్సర్‌తో పోరాటం.. సాయం కోరుతూ పోస్ట్..