Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరస సినిమాతో ప్రస్తుతం బిజీబిజీగా ఉన్నాడు. వకీల్ సాబ్ తో హిట్ కొట్టిన పవన్ కళ్యాణ్.. నెక్స్ట్ భీమ్లా నాయక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న ఈ సినిమా శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మరోవైపు హిస్టారికల్ మూవీ హరిహర మల్లు షూటింగ్ లో పాల్గొనడానికి రెడీ అవుతున్నాడు. ఈ నేపథ్యంలో గత నెలలో పవన్ కళ్యాణ్ క్రిస్టమస్ సెలబ్రేషన్స్ కోసం రష్యా వెళ్లిన సంగతి తెలిసిందే. భార్య అన్నా లెజినోవా పిల్లలు రష్యాలో ఉండగా.. తిరిగి పవన్ కళ్యాణ్ భారత్ కు వచ్చారు.
హైదరాబాద్ లో లాండ్ అయిన పవన్ కళ్యాణ్ తాజాగా ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పవన్ కొత్తగా స్మార్ట్ లుక్ తో దర్శనం ఇస్తున్నాడు. తమ అభిమాన నయా లుక్ కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. బ్లాక్ అండ్ షేడ్ బ్లాక్ డ్రెస్‌లో పవన్ అదిరిపోయాడు. పవన్ తాజాగా లుక్ సూపర్బ్ అంటూ ట్రెండ్ చేస్తున్నారు.
ఇప్పటికే భీమ్లా నాయక్ సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకుంది. దీంతో హరహర మల్లు షూటింగ్ ను తిరిగి ప్రారంభించడానికి రెడీ అవుతున్నాడు. అంతేకాదు హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘భవదీయుడు భగత్ సింగ్ చిత్ర షూటింగ్ కూడా ఈ ఏడాదే ప్రారంభం కానుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిత్రానికి కూడా పవన్ ఒకే చెప్పాడు. ఓ వైపు రాజకీయాలు, మరో వైపు వరస సినిమాలతో పవన్ కళ్యాణ్ 2022 క్యాలెండర్ ఫుల్ బిజీ అన్నమాట.
Also Read: పంజాబ్ ఘటన దురదృష్టకరం.. ప్రధాని మోడీ భద్రతలో వైఫల్యంపై పవన్ కామెంట్స్..