పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతిలో ప్రస్తుతం మూడు చిత్రాలున్నాయి. ఇప్పటికే డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో హరి హర వీరమల్లు సినిమాలో నటిస్తుండగా.. డైరెక్టర్ హరిష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్, సుజీత్ దర్శకత్వంలో మరో ప్రాజెక్ట్ చేయబోతున్నారు. త్వరలోనే ఈ రెండు సినిమాలు షూటింగ్స్ ప్రారంభం కానున్నాయి. ఇక వీటితోపాటు..పవన్ కళ్యాణ్ మరో రీమేక్ చేయబోతున్నారు. ఈ చిత్రానికి సముద్రఖని దర్శకత్వం వహించనున్నారు. తమిళ్ ఇండస్ట్రీలో సూపర్ హిట్ అయిన వినోదయ సితం అనే చిత్రాన్ని రీమేక్ చేయనున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ తోపాటు.. సాయి ధరమ్ తేజ్ కూడా ప్రధాన పాత్రలో నటించనున్నారు. ఇక తర్వలోనే ఈ ప్రాజెక్ట్ కూడా మొదలు పెట్టనున్నారని టాక్.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను పవన్ ముందు స్టార్ట్ చేస్తాడని తెలుస్తోంది. ఎందుకంటే ఈ సినిమాకు కేవలం పవన్ కేటాయించింది 25 రోజులు మాత్రమే. 25 రోజులలో అతని పోర్షన్ కంప్లీట్ అయిపోతుందట. అలాగే సుజీత్ తెరకెక్కించే సినిమా కూడా అంతే ఉండబోతుందట. కేవలం నెల రోజుల లోపు కాల్షీట్స్ ఇస్తే సరిపోతుందట. ఆ సినిమాకు కూడా తొందరగా పూర్తి అయిపోతుందని అంటున్నారు. ఇక సముద్రఖని తెరకెక్కించే సినిమా ప్రేమికుల రోజున అంటే ఫిబ్రవరి 14న షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారని సమాచారం.
ఈ సినిమా ఒరిజినల్ లో సముద్రఖని పోషించిన పాత్రను పవన్ కళ్యాణ్ కనిపించనున్నారు. ఇందులో మరోసారి పవన్ దేవుడిగా కనిపించనున్నారు. గోపాల గోపాల సినిమా తర్వాత రెండోసారి దేవుడి పాత్రలో నటిస్తున్నారు పవన్.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.