MAA Elections: ‘మా’లో విందు రాజకీయాలు.. నెట్టింట వైరల్‌ అవుతోన్న నరేష్‌ పార్టీ ఆహ్వాన మెసేజ్‌.

MAA Elections: మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్ (మా) ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. సాధారణ ఎన్నికలను తలపిస్తోన్న ఈ ఎన్నికలు రోజురోజుకీ ఆసక్తిని పెంచుతున్నాయి. ఇంకా ఎన్నికల తేదీ కూడా..

MAA Elections: మాలో విందు రాజకీయాలు.. నెట్టింట వైరల్‌ అవుతోన్న నరేష్‌ పార్టీ ఆహ్వాన మెసేజ్‌.

Updated on: Sep 03, 2021 | 7:39 AM

MAA Elections: మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్ (మా) ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. సాధారణ ఎన్నికలను తలపిస్తోన్న ఈ ఎన్నికలు రోజురోజుకీ ఆసక్తిని పెంచుతున్నాయి. ఇంకా ఎన్నికల తేదీ కూడా ప్రకటించకముందే పోటీదారులు రంగంలోకి దిగారు. మొన్నటి వరకు మాటలకు పరిమితమైన రాజకీయం ఇప్పుడు కొత్త మలుపు తీసుకుంది. తాజాగా ప్రస్తుత మా అధ్యక్షుడు నరేష్‌ విందు రాజకీయాలకు తెరతీశారు. ప్రస్తుతం ఆయన పేరుతో ఓ ఆహ్వాన సందేశం నెట్టింట వైరల్‌గా మారింది.

 

వివరాల్లోకి వెళితే.. శనివారం సాయంత్రం 6 గంటలకు ఏర్పాటు చేస్తున్న పార్టీకి తప్పకుండా రావాలంటూ ఓ మెసేజ్‌ గురువారం పలువురు నటీనటుల వాట్సాప్‌ గ్రూప్‌లలో సర్కులేట్‌ అవుతోంది. హైదరాబాద్‌లోని దశ్‌పల్లా ఫోరమ్‌ హాల్‌లో ఏర్పాటు చేయనున్న ఈ విందు కార్యక్రమానికి ఆహ్వానం శుక్రవారం వస్తుందని సదరు సందేశంలో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఈ మెసేజ్‌ డాక్టర్‌ నరేష్‌ విజయ్‌కృష్ణ పేరుతో వైరల్‌ అవుతోంది.

ఇక ఈ సందేశం ప్రకాష్‌ రాజ్‌ ప్యానెల్‌ సభ్యులకు తప్ప మిగతా సభ్యులకు ఫార్వర్డ్‌ చేస్తుండడం గమనార్హం. నరేష్‌ వర్గం మంచు విష్ణుకి మద్ధతు ఇస్తోన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ విందు రాజకీయానికి మొదట ప్రకాష్‌ రాజ్‌ ప్యానెల్‌ తెర తీసిందని చెప్పాలి. ఇటీవల జరిగిన నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా పార్టీ ఉందంటూ ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యడు సమీర్ ఆహ్వానం ఇచ్చారు. దీంతో ఇంకా ఎన్నికల తేదీ ప్రకటించకముందే ఇలా ఉంటే ఎన్నికల షెడ్యూల్‌ వచ్చిన తర్వాత రాజకీయం మరింత రసవత్తరంగా మారుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Also Read: JR NTR: పెళ్లి చూపుల తర్వాత లక్ష్మీ ప్రణతిని ఎన్టీఆర్‌ ఏమని అడిగాడో తెలుసా? జూనియర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు.

Pawan Kalyan: వెల్లువెత్తిన శుభాకాంక్షలు.. అభిమానులకు కృతజ్ఞతలు తెలిపిన పవన్ కళ్యాణ్..

Rashi Khanna: తెల్ల పూలతో, కవ్వించే చూపులతో మనసు దోచుకుంటున్న బొద్దు ముద్దుగుమ్మ రాశి ఖన్నా..