హారర్‌తో పాటు సినిమాలో కావలసినన్ని ట్విస్టులు ఉంటే.. ఆ వచ్చే కిక్కే వేరప్పా. అవునండీ.! ఇలాంటి హారర్ థ్రిల్లర్‌లకు ఫ్యాన్ బేస్ ఎక్కువే ఉంటుంది. హారర్ మూవీ లవర్స్ అయితే.. ప్రతీ సినిమాలోనూ కూసింత కొత్తదనాన్ని తప్పనిసరిగా కోరుకుంటారు. ఇక అలా వారి ఎక్స్‌పెక్టేషన్లకు రీచ్ అయిందంటే.. అది బెస్ట్ హారర్ ఫ్లిక్ అయినట్టే. మరి ఇప్పుడు మనం చెప్పుకోబోయేది కూడా ఆ టైప్ జోనర్‌కు చెందిన మూవీనే. మరి ఈ సినిమా టైటిల్ ఏంటి.? ఏ ఓటీటీలో చూడొచ్చునంటే.?
నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సినిమా టైటిల్ వచ్చేసి.. ‘ది గార్డియన్’. వియత్నాం భాషలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాను ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో మీరు చూడవచ్చు. ఇంతకీ కథ విషయానికొస్తే.. సీన్ ఓపెన్ చేయగానే.. ఓ ఫ్లాట్‌లో ఒక అమ్మాయి అందంగా రెడీ అయి.. ఓ బొమ్మను పట్టుకుని బాత్ టబ్‌లో సూసైడ్ చేసుకుంటుంది. ఇక కట్ చేస్తే.. ఇన్‌స్టాలో పాటలు పాడుతూ పెద్ద సింగర్ అయిపోవాలన్న కలలు కనే హీరోయిన్ ఎంట్రీ. అయితే ఈమె పాటలు పాడటం వాళ్ల ఇంట్లో వాళ్లకు ఇష్టం లేదు. ముఖ్యంగా వాళ్ల నాన్నకు తెలియకుండా సీక్రెట్‌గా సింగింగ్ చేస్తూ ఉంటుంది. ఇక మొదటి సీన్‌లో చనిపోయిన అమ్మాయి గ్రేట్ సింగర్ కాబట్టి.. ఆ వార్త కాస్తా వైరల్ అవుతుంది. ఇక తనను ఇన్‌స్పైర్ చేసే వ్యక్తి చనిపోవడంతో డీప్ షాక్‌లోకి వెళ్లిపోతుంది హీరోయిన్.
ఇంతలో పోలీసులు వచ్చి.. హీరోయిన్‌ను ఇంటరాగేషన్ పేరుతో స్టేషన్‌కి తీసుకెళ్తారు. అసలు ఆ సింగర్‌కి ఏమైంది.? ఏమైనా డిసీజ్ ఉందా.? ఆమె చేతిలో ఉన్న బొమ్మ ఏంటి.? అంటూ ప్రశ్నలు అడుగుతారు. వాటినన్నింటికి తనకు ఏం తెలియదని సమాధానం చెప్పి వచ్చేస్తుంది హీరోయిన్. ఇక ఇంటికి రాగానే.. హీరోయిన్‌కి కొన్ని వింత సంఘటనలు ఎదురవుతాయి. అందుకే హీరోయిన్.. ఆ సింగర్ అంత్యక్రియలకు వెళ్లి.. ఆమెను క్షమాపణలు అడిగి వస్తుంది. ఇంతకీ ఆ సింగర్‌కు, ఈమెకు ఉన్న రిలేషన్ ఏంటి.? మధ్య ఆ బొమ్మ స్టోరీ ఏంటి.? అసలు హీరోయిన్ గతం ఎలాంటిది.? అనే విషయాల కోసం మీరు సినిమా తప్పక చూడాల్సిందే.
ఇది చదవండి: ఒక్క సినిమాతో స్టార్‌డమ్.. వ్యభిచార కేసుతో కెరీర్ మటాష్.. ఈ బ్యూటీ ఎవరో తెల్సా
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి