టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ చిత్రం ఖుషీ. డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. ఇందులో విజయ్ సరసన సమంత కథానాయికగా నటించింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, ట్రైలర్ సినిమాపై మరింత ఆసక్తిని కలిగించాయి. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 1న విడుదల కానుంది. ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా సినిమా ప్రమోషన్స్ వేగం పెంచారు మేకర్స్. మరోవైపు మయోసైటిస్ చికిత్స కోసం అమెరికా వెళ్లింది సామ్. ఇక విజయ్ దేవరకొండ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఐదో సాంగ్ ప్రోమో రిలీజ్ చేసింది మూవీ టీం. ఓసి పెళ్లామా అంటూ సాగిపోతున్న ఈ పాటలోని సీన్స్ సినిమాపై ఆసక్తిని కలిగిస్తున్నాయి.
ఓసి పెళ్లామా అంటూ సాగే పాటలో కశ్మీర్లో సమంతను చూసి ప్రేమలో పడడం.. పెళ్లి చేసుకోవడం.. ఆ తర్వాత తమ జీవితంలో ఎదుర్కొన్న పరిస్థితులు.. భార్యతో తాను పడే పాట్లు చెప్పుకొచ్చాడు విజయ్. ఇక అందులో విజయ్, సామ్ మధ్య వచ్చే సీన్స్ మాత్రం మరింత ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఈ పాట ఫుల్ వీడియోను ఆగస్ట్ 26న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు.
I ask prior forgiveness from all the sweetest women who love me 😄https://t.co/9y3B5OaYAC#Kushi 5th Single – Aug 26
Just 7 more days ❤️ pic.twitter.com/iSKdcAVtvQ
— Vijay Deverakonda (@TheDeverakonda) August 25, 2023
మహానటి సినిమా తర్వాత విజయ్, సమంత కలిసి నటిస్తోన్న సినిమా ఇదే. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఆరాధ్య, నా రోజా నువ్వే పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ఐదో పాట కూడా ఆసక్తిని కలిగిస్తోంది. ఈ సినిమాను తెలుగుతోపాటు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీ్ చేస్తున్నారు. ఈ సినిమాలో జయరాం, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, లక్ష్మీ, అలీ కీలకపాత్రలలో నటిస్తున్నారు.
Back to entertaining the Families ❤️#Kushi is ready for you all – U/A
We are Just 9 days away. pic.twitter.com/R6JEutsO5e
— Vijay Deverakonda (@TheDeverakonda) August 23, 2023
ప్రస్తుతం సమంత అమెరికాలో రిలాక్స్ అవుతున్నారు. దాదాపు ఏడాది కాలం సినిమాలకు బ్రేక్ తీసుకున్న ఆమె.. మయోసైటిస్ సమస్యకు అక్కడే చికిత్స తీసుకోనున్నారు. ఈ సమస్య నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత సామ్ తిరిగి సినిమాలపై దృష్టి పెట్టనున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.