Leo Movie : అంచనాలు పెంచేస్తోన్న దళపతి విజయ్.. లియో పోస్టర్ అదిరిందిగా

విజయ్ సినిమాలు అవలీలగా 200 కోట్లకు పైగా వసూల్ చేస్తూ రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. అయితే  విజయ్ నటించిన లాస్ట్ మూవీ బీస్ట్ బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆకట్టుకోకపోవడమతొ విజయ్ నెక్స్ట్ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. విజయ్ ప్రస్తుతం లియో అనే సినిమాలో నటిస్తున్నాడు. విక్రమ్ సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్న లోకేష్ కానగరాజ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. లోకేష్ సినిమాలకు కోలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. ఆయన సినిమాలు తెలుగులోనూ మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంటున్నాయి.

Leo Movie : అంచనాలు పెంచేస్తోన్న దళపతి విజయ్.. లియో పోస్టర్ అదిరిందిగా
Leo

Updated on: Sep 19, 2023 | 12:56 PM

దళపతి విజయ్ సినిమా అంటే చాలు ప్రేక్షకుల్లో ఎక్కడలేని ఆసక్తి మొదలవుతుంది. ఈ మధ్య కాలంలో విజయ్ నటించిన సినిమాలన్నీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంటున్నాయి. విజయ్ సినిమాలు అవలీలగా 200 కోట్లకు పైగా వసూల్ చేస్తూ రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. అయితే  విజయ్ నటించిన లాస్ట్ మూవీ బీస్ట్ బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆకట్టుకోకపోవడమతొ విజయ్ నెక్స్ట్ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. విజయ్ ప్రస్తుతం లియో అనే సినిమాలో నటిస్తున్నాడు. విక్రమ్ సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్న లోకేష్ కానగరాజ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. లోకేష్ సినిమాలకు కోలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. ఆయన సినిమాలు తెలుగులోనూ మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంటున్నాయి.

ఇక లియో సినిమానుంచి వినాయక చవితి సందర్భంగా లియో నుంచి ఆసక్తికర పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాను తెలుగులోనూ భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. విజయ్ ప్రతి సినిమా తెలుగులోనూ రిలీజ్ అవుతూ మంచి విజయాలను అందుకుంటున్నాయి. ఇక ఇప్పుడు లియో పై కూడా తెలుగు ఆడియన్స్ లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది.

దళపతి విజయ్ ఫ్యాన్స్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్

ఇక లియో సినిమాలో విలన్ గా బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కనిపించనున్నారు. లోకేష్ తెరకెక్కించిన ఖైదీ, విక్రమ్ సినిమాలకు ఈ సినిమాతో లింక్ ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాలో విజయ్ కు జోడీగా త్రిష నటిస్తుంది. చాలా సంవత్సరాల తర్వాత విజయ్ త్రిష కలిసి స్క్రీన్ పై సందడి చేయనున్నారు. ఇప్పటికే లియో నుంచి విడుదలైన సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.